You might be interested in:
Sponsored Links
జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వ య అధికారి (డీసీహెచ్‌ఎస్) పరిధిలో 12 కేడర్లకు సంబంధించి 23 పోస్టులకు 2,503 దరఖాస్తులు వచ్చాయని డీసీహెచ్‌ఎస్ జి.వి.రాజ్యలక్ష్మి తెలిపారు.బయో స్టాటిస్టియన్ ఒక పోస్టుకు 46 దరఖాస్తులు, ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులకు 268, ఆడియో మెట్రిషిన్ 4 పోస్టులకు 15, రేడియాగ్రాఫర్ ఒక పోస్టుకు 51, ఫిజియోథెరపిస్టు 2 పోస్టులకు 84, బయోమెడికల్ ఇంజినీర్ ఒక పోస్టుకు 33, థియేటర్ అసిస్టెంట్ 3 పోస్టులకు 168, మెడికల్ రికార్డు అసిస్టెంట్ ఒక పోస్టుకు 388, ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులకు 128, ఎలక్ట్రీషియన్ ఒక పోస్టుకు 115, జనరల్ డ్యూటీ అటెండెంట్ 10 పోస్టులకు 1177, ప్లంబర్ ఒక పోస్టుకు 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎంపిక పక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
0 comment