You might be interested in:
Sponsored Links
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. గతంలో జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తుండేవారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఇంటర్ తొలి ఏడాది అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,505 కళాశాలు ఉండగా... ఆయా కళాశాలల్లో చదువుకునే విద్యార్థు లకు రివైజ్ టెస్టుబుక్ లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. జేఈఈ, నీట్, ఎంసెట్ పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను బోర్డు పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. ఆన్లైన్లో ఉంచనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి ఏడాదిలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈ ఆర్) సిలబస్ ను అమలు చేయనున్నారు. ఇక వృత్తి విద్యా కోర్సుల్లో డ్యుయల్ సర్టిఫికెట్ విధానం ఉంటుంది. ఒకటి జాతీయ నైపుణ్య కౌన్సిల్ సర్టిఫికెట్, ఇంకొకటి ఇంటర్మీడి యట్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వనున్నారు.
0 comment