You might be interested in:
Anganwadi Notification Soon: తెలంగాణలోని మహిళలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు(Womens Day) నేపథ్యంలో 14 వేల అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్త్రీశిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మందితో సభ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేరోజు ఖాళీల భర్తీకి సంబంధించి నియామక ప్రకటనను విడుదల చేస్తామని స్పష్టంచేశారు
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం (మార్చి 1) ఆమె సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
0 comment