You might be interested in:
LIC Best Pension Plan: ఎల్ఐసీ అందిస్తున్న సరల్ పెన్షన్ ప్లాన్ ఇది. ఇందులో పెన్షన్ అందుకునేందుకు రిటైర్‌మెంట్ వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు.
ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో అప్పటి నుంచే పెన్షన్ తీసుకోవచ్చు. ఆర్ధికంగా సెక్యురిటీ అందించే ప్లాన్ ఇది. ఇందులో అవసరమనుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు. మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఏడాదికి 64 వేల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
ఎల్ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్ అనేది స్థిరమైన పెన్షన్ పొందేందుకు అద్భుతమైన అవకాశం. ఇందులో మీరు పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ మొదలవుతుంది. అవసరమనుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయస్సు 40 ఏళ్లు కాగా గరిష్టంగా 80 ఏళ్లు ఉండవచ్చు. ఈ పాలసీలో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. పాలసీ తీసుకున్నప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి పాలసీ కొనుగోలు చేసిన తరువాత క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుంది. ఈ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సింగిల్ రెండవది జాయింట్ లైఫ్.
సింగిల్ పాలసీలో పెన్షన్ ఆ వ్యక్తికి జీవితాంతం లభిస్తుంది. వ్యక్తి మరణానంతరం ఇన్వెస్ట్ చేసిన మొత్తం నామినీకు తిరిగి ఇచ్చేస్తారు. జాయింట్ లైఫ్ ప్లాన్ అయితే పాలసీదారుడికి, బాగస్వామికి ఇద్దరికీ కవర్ అవుతుంది. జీవితాంతం పాలసీదారుడికి పెన్షన్ లభిస్తుంది. అతని మరణానంతరం భాగస్వామికి లభిస్తుంది. ఇద్దరూ మరణిస్తే నామినీకు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు లభిస్తాయి.
ఈ ప్లాన్‌లో పెన్షన్ ఎంత వస్తుందనేది మీరు పెట్టే పెట్టుబడిని బట్టి ఉంటుంది.పెన్షన్ నెలకు, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి తీసుకోవచ్చు. 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు పెన్షన్ తీసుకునేందుకు వీలుంటుంది. 60 ఏళ్ల వయస్సులో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 64,350 రూపాయలు పెన్షన్ లభిస్తుంది.
0 comment