You might be interested in:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలోని 60 నియోజకవర్గాలలో మొత్తం 1 లక్ష కుట్టు మిషన్లు పంపిణీ చేయబడతాయి.
అర్హతలు:
మహిళలు మాత్రమే అర్హులు.
ఆంధ్ర ప్రదేశ్‌లో స్థిర నివాసి అయి ఉండాలి.
సరైన ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
వయసు 20 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ₹2 లక్షలు మించరాదు.
వితంతువులు, దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యం.
శిక్షణ సమయంలో కనీసం 70% హాజరు తప్పనిసరి.
ఆధార్ కార్డు
ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
రేషన్/రైస్ కార్డు
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
స్వయం ఉపాధి, జనరిక్ మెడికల్ షాపులకు సబ్సిడీపై రుణాలు
ఏపీ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు, జనరిక్ మెడికల్ షాపులకు సబ్సిడీతో రుణాలు అందిస్తుంది. బీసీ, కాపు, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులకు రుణాలు ఇచ్చేందుకు ఏపీఓబీఎంఎంఎస్ https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసింది. ప్రస్తుతానికి బీసీ, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులను నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభించింది. అర్హులైన వారు 10-03-2025 నుంచి 22-03-2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
శిక్షణా కార్యక్రమం:
మార్చి 8, 2025 నుండి శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో 6-10 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి, ఒక్కో కేంద్రంలో 30-50 మహిళలకు 45-90 రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ సమయంలో కనీసం 70% హాజరు నమోదు చేసిన వారికి మాత్రమే ఉచిత కుట్టు మిషన్లు అందజేయబడతాయి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని సందర్శించి, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోండి.
0 comment