You might be interested in:
Sponsored Links
AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలను ఈసారి వాట్సాప్ ద్వార విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఫలితాలు విడుదల చేస్తే ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లడమో, సెల్ఫోన్లోనో చూసుకునే వాళ్లు.
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్ ఫలితాలు!
ఇకపై ఈ ఇబ్బంది లేకుండా నేరుగా ఫలితాలు విద్యార్థి తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్లకే పంపించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏప్రిల్ 10 నాటికి మూల్యాంకనం పూర్తి
ఇంటర్ పరీక్షలు ఈ మధ్య ముగిశాయి. మూల్యాంకనమం కూడా వేగంగా సాగుతోంది. మార్చి 17తో పరీక్షలలు పూర్తి అయ్యాయి. మార్చి 19 నుంచి మూల్యాంకనం ప్రారంభమైంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 10 నాటికి పూర్తి కానుంది. మిగతా ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు అధికారులు
0 comment