You might be interested in:
AP P4 Survey : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, ప్రతి ఇంట్లో ‘ఆరోగ్యం, ఆదాయం, ఆనందం’ ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పీ4 సర్వేకు సంకల్పించారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్(పీ4) సర్వేకు శ్రీకారం చుట్టారు.
AP P4 Policy Survey Form
పేదరిక నిర్మూలన - P4 విధానంపై అభిప్రాయ సేకరణ పత్రం సంఘాలకు సాధికారత కల్పించడం, మెరుగైన భవిష్యత్తు నిర్మించడం
ప్రభుత్వ, ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం(P4) అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలను రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ 20% కుటుంబాలకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి, మరియు ప్రగతి వైపు నడిపించేందుకు రూపొందించబడింది.
ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారికి మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం, మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించే మార్గాలను ఏర్పాటు చేసి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తాయి.
P4 కేవలం దాతృత్వానికి పరిమితం కాకుండా, దీర్ఘకాలిక సాధికారత మరియు భాగస్వామ్య సంపన్నత అనే లక్ష్యాలను నెరవేర్చే విధంగా రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఓ సమన్వయకర్తగా వ్యవహరించి, సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఒక స్వయం-నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యవస్థను నిర్మించడానికి సహకరిస్తుంది.
ఈ విధానం ద్వారా, ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు స్పష్టమైన ఫలితాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. మీ అభిప్రాయం ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తుంది. " స్వర్ణ ఆంధ్ర@2047 " దార్శనికతను సాకారం చేసుకోవడానికి కలిసి పనిచేద్దాం మనం సమిష్టిగా సంపన్నమైన, ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ని సృష్టించగలమని విశ్వసిద్దాము!
0 comment