You might be interested in:
బదిలీల చట్టం :
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలపై చట్టం చేసేందుకు ఉపాధ్యాయుల సూచనలు, అభిప్రాయాలు కోరుతూ డ్రాఫ్ట్ విడుదల చేసింది. 5600మంది బదిలీల డ్రాఫ్ట్ప తమ సూచనలు, సలహాలు తెలియజేసారు. ఉపాధ్యాయుల నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డ్రాఫ్ట్ ఫైనల్ చేసారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలలో వచ్చిన సారాంశం ఆధారంగా బదిలీల చట్టంలో ఈ క్రింది అంశాలు మార్పు చేసే అవకాశం ఉంది.
1. ప్లెయిన్ ఏరియా నుండి ఏజెన్సీకి కోరుకునే వారికి ఇకపై జరిగే బదిలీలలో ప్రతి సంవత్సరానికి ఒక పాయింట్ చొప్పున కేటాయిస్తారు. ఇవి సదరు ఉపాధ్యాయునికి వచ్చే సర్వీస్ పాయింట్లు, స్టేషన్ పాయింట్లు, స్పెషల్ పాయింట్లకు అదనంగా ఇవ్వబడతాయి.
2. ప్రతి ఒక సంవత్సరం సర్వీస్కు 0.5పాయింట్లు చొప్పున కేటాయిస్తారు.
3. రిటైర్మెంట్కు 3 సం॥ల లోపు సర్వీస్ ఉన్న వారికి బదిలీల నుండి మినహాయింపుపై జిఏడి అనుమతి మేరకు నిర్ణయం తీసుకుంటారు.
4. జిఏడి వారు ఇచ్చిన ఉత్తర్వులలో కంపాషినేట్ అపాయింట్మెంట్ పొందిన వితంతువులకు మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరి ఇవ్వబడింది. ఉపాధ్యాయ నియామకాల్లో ఆ విధమైన సౌకర్యం లేనందున జిఏడి అనుమతి మేరకు ప్రిఫరెన్షియల్ కేటగిరి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసారు.
5. వికలాంగులు 5/8 సం॥లు పూర్తి అయితే తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. 40-54%, 55-69% అంగవైకల్యం కలిగిన వారికి వేరు వేరుగా స్పెషల్ పాయింట్లు కేటాయిస్తారు. 70% పైబడి అంగవైకల్యం కలిగిన వారికి ప్రిఫరెన్షియల్ కేటగిరి వర్తింపజేస్తారు.
6. వివిధ రకాల జబ్బులకు ప్రిఫరెన్షియల్ కేటగిరి ఇవ్వాలనే దానిపై జరిగిన చర్చలో జిఏడి విడుదల చేసిన ఉత్తర్వులలో లేని వ్యాధులకు ప్రిఫరెన్షియల్ కేటగిరి ఇవ్వడం జరుగదని, భవిష్యత్లో జిఏడి నోటిఫై చేస్తే వాటిని తదుపరి బదిలీలలో చేర్చుతామని హామీ ఇచ్చారు.
7. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లతో సహా అన్ని కేడర్ల ఉపాధ్యాయులకు ఈ సం॥ బదిలీలు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు.
8. ఉపాధ్యాయుల నుండి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలనే డిమాండ్ వచ్చినప్పటికి విద్యాశాఖ అంగీకరించ లేదు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే బదిలీలు జరుగుతాయని తెలియజేసారు.
9. బదిలీలలో పర్మార్ఫెన్స్ పాయింట్లు తీసివేయడానికి అంగీకరించారు.
గమనిక : బదిలీల చట్టం వచ్చేవారంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టబడుతుంది. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత అది చట్టంగా మారుతుంది. వచ్చే వేసవి సెలవుల్లో ఈ చట్టం ఆధారంగా బదిలీలు నిర్వహిస్తారు.
0 comment