You might be interested in:
ఈనాడు జర్నలిజం స్కూలు మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. దరఖాస్తు రుసుము Rs 200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ విడుదల
ఎంపిక ప్రక్రియ
- మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి.
- తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్ని, అనువాద సామర్థ్యాన్ని, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్ని పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి.
- తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.
- వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి.
- సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.
శిక్షణ మరియు భృతి
- ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది.
- మొదటి ఆరు నెలలు Rs 14,000, తరువాతి ఆరు నెలలు Rs 15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
ఉద్యోగ అవకాశాలు
- స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది.
- ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో Rs 20,000 జీతం ఉంటుంది.
- అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో Rs 22,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో Rs 24,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం
- దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి.
- దరఖాస్తు రుసుము Rs 200 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.
అర్హతలు
- తేట తెలుగులో రాయగల నేర్పు
- ఆంగ్లభాషపై అవగాహన
- లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు
- ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన
- 30.06.2025 నాటికి 28కి మించని వయసు
- డిగ్రీ ఉత్తీర్ణత (చివరి సంవత్సరం పరీక్షలు రాసిన/ రాస్తున్న అభ్యర్థులూ అర్హులే)
ముఖ్య తేదీలు
- నోటిఫికేషన్ : 23.03.2025
- ఆన్‌లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువు : 22.04.2025
- ప్రవేశ పరీక్ష : 11.05.2025
- కోర్సు ప్రారంభం : 30.06.2025
0 comment