You might be interested in:
Child Welfare Committee Jobs: రాష్ట్రంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువెనైల్ జస్టిస్ బోర్డులో నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోండి.
మొత్తం ఖాళీలు:
రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు, జువెనైల్ జస్టిస్ బోర్డుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ఇందులో బాలల సంక్షేమ కమిటీల్లో ఒక్కొ జిల్లాలకు ఐదు ఖాళీలు చొప్పున 13 జిల్లాలకు 65 ఖాళీలు ఉన్నాయి. అలాగే జువెనైల్ జస్టిస్ బోర్డుల్లో ఒక్కో జిల్లాలకు రెండేసి ఖాళీలు చొప్పున 13 జిల్లాలకు 26 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 91 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
నియామకాలు నిర్వహించే జిల్లాలు:
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లా
అర్హత: డిగ్రీ
వయో పరిమితి
చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో చైర్ పర్సన్లు, మెంబర్లు, జువైనల్ జస్టిస్ బోర్డుల్లో సోషల్ వర్కర్ మెంబర్ల నియామకానికి వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు 09.04.24 సాయంత్రం 5.30 లోపు అందించాలి.
దరఖాస్తు సమర్పించాల్సిన అడ్రస్:
The Director, Dept. of Juvenile Welfare, Correctional Services & Welfare of Street Children, D.No.3-1-265/4A, Govt. Observation Home for Boys premises, Near Kabela Centre, Rotary Nagar, Vidyadharapuram, Vijayawada - 520 012, NTR Dist., A.P
దరఖాస్తు చేసే విధానం:
అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి క్రింది బండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి అందుకు అర్హత గల జిరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తు చేయాలి
0 comment