You might be interested in:
Gail Recruitment 2025 : గెయిల్ జాబ్స్ పడ్డాయి.. ఆసక్తిగల అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. గేట్ స్కోరు ఉన్నవారే అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక అయినవారికి నెలకు రూ.లక్షా 80వేల వరకు జీతం వస్తుంది. న్యూఢిల్లీలోని ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ (GAIL) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 73 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ జాబ్స్ ప్రకటించింది. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గేట్-2025 స్కోరు ఉండాలి. ఈ గేట్ స్కోరు ఆధారంగానే ఆయా పోస్టుల్లో ఖాళీలకు ఎంపిక చేస్తారు. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల్లో అనేక విభాగాలు ఉన్నాయి. కెమికల్‌లో 21 ఖాళీలు, ఇన్‌స్ట్రుమెంటేషన్ 17 ఖాళీలు, ఎలక్ట్రికల్ విభాగంలో14 ఖాళీలు, మెకానికల్ విభాగంలో 8 ఖాళీలు, బీఐఎస్‌లో 13 ఖాళీలు ఉన్నాయి
గెయిల్ అర్హతలివే :
గెయిల్ పోస్టుల కోసం అప్లయ్ చేసే అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే గేట్-2025 స్కోరు కూడా తప్పనిసరి. అందులోనూ ఫుల్‌టైమ్ రెగ్యులర్ కోర్సు మాత్రమే చేసి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేసినవారు కూడా అర్హులే.
2024-2025 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు కూడా ఈ పోస్టుల కోసం అప్లయ్ చేయొచ్చు. 2023 అంతకన్నా సంవత్సరంలో ఇంజినీరింగ్ పూర్తి చేసినవారికి అనుమతి లేదు. చివరిగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపికైనవారి వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
ఎంపిక ప్రక్రియ :
గేట్-2025 స్కోరు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇందులో మంచి స్కోరు చేసిన అభ్యర్థులనే షార్ట్‌లిస్టు చేస్తారు. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ రెండింటిలో కూడా తమ సత్తాను చాటాల్సి ఉంటుంది. గేట్-2024లో మంచి స్కోరు చేసినా ఫలితం ఉండదు.
ఒకవేళ మీరు ఉద్యోగం చేసేవారు అయితే ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం వరకు ప్రొబేషన్ పీరియడ్ వర్క్ చేయాల్సి ఉంటుందని గమనించాలి.
వయస్సు పరిమితి :
గెయిల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 26 ఏళ్లు పైబడి ఉండరాదు. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితి, మాజీ సైనికోద్యోగులు, ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితి, దివ్యాంగులకు అయితే 10 నుంచి 15ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
జీతం ఎంతంటే? :
ఈ గెయిల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జీతం రూ.60వేల నుంచి ప్రారంభమై రూ. లక్షా 80వేల వరకు వస్తుంది. ముందుగా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలోనే నెలకు రూ.60వేలు వేతనంగా అందుకుంటారు. కనీస వేతనంతో పాటు అలవెన్స్‌లు, హెచ్‌ఆర్‌ఏ, పర్ఫార్మెన్స్ పే, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ వంటి అనేక సదుపాయాలను పొందవచ్చు.
ఈ పోస్టులకు ఒకరు మాత్రమే ఒకసారి అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులను పంపితే అన్ని రిజెస్ట్ అవుతాయి జాగ్రత్త. ఆన్‌లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ మార్చి 18, 2025 వరకు మాత్రమే సమయం ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తుంటే.. గేట్ స్కోరు అర్హత ఆధారంగా ఇప్పుడే ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోండి.
0 comment