HEAL Paradise School Admissions 2025-2026 - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

HEAL Paradise School Admissions 2025-2026

You might be interested in:

Sponsored Links

2025-26 విద్యా సంవత్సరానికి హీల్ పాఠశాల (స్వచ్ఛంద సంస్థ) తోటపల్లి లో అడ్మిషన్స్ కొరకు1 నుండి 5 వ తరగతి వరకు మరియు 11 వ తరగతి M.P.C  [Mathematics , Physics, and Chemistry ] , Bi.P.C  [Biology , Physics, and Chemistry] , MEA [Mathematics , Economics and Accountancy]  కోర్సులకు ప్రవేశానికై అనాధ బాలబాలికలు లేదా తల్లి లేదా తండ్రిని కోల్పోయి ఆర్థికంగా వెనకబడిన బాలబాలికల నుండి దరఖాస్తులు స్వీకరించబడుచున్నాయి.


HEAL Paradise School Admissions 2025-2026

ఆంధ్రప్రదేశ్, ఆగిరిపల్లి మండలం, తోటపల్లిలో గల హీల్ పాఠశాల పూర్తిగా దాతల సాయాంతో నడుస్తు అనాథ మరియు నిరుపేద పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలో CBSE విద్యను పూర్తి ఉచితంగా  అందిస్తుంది. అనుభవం, అంకితభావం, కలిగి వృత్తిని నిర్వహించే అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందితో అధ్భుతమైన ప్రయోగశాలలు, లైబ్రరీ, క్రీడాప్రాంగణంలను కలిగి ఉంది.  హీల్ విద్యార్థులు విద్యా, క్రీడారంగం, నృత్య, సంగీతం, వక్తృత్వ, మొదలైన రంగాలలో అత్యంత ప్రతిభను కనబరుస్తు వివిధ ఉన్నత విద్యాసంస్థలలో చేరి మెడికల్ , ఇంజనీరింగ్ మరియు ఇతర కోర్సులలో ప్రధమ స్థానంలో నిలుస్తున్నారు. క్రీడలు, సైన్స్ ప్రాజెక్ట్లు మరియు సాంస్కృతిక పోటీలలో హీల్ పాఠశాల విద్యార్థులు జాతీయ మరియు రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధిస్తున్నారు.

హీల్ పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు హీల్ కుటుంబ సభ్యులుగానే చూడబడతారు. హీల్ తన కుటుంబంలోని పిల్లలకు పైన ఉదాహరించినా అన్నీ అంశాలలో కోచింగ్ ఇస్తూ  వారి జీవితాలలో ఉన్నతంగా స్థిరపడడానికి తోడ్పాటును అందిస్తుంది.

ప్రస్తుతం, తరగతులు I నుండి XII తరగతుల వరకు 870 మంది బాలబాలికలు చదువుతున్నారు. 

 దరఖాస్తు చేసుకొనుటకై అర్హతలు (1 నుండి 5 వ తరగతి వరకు)

1. తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన ఆర్థికంగా వెనుకబడిన 6 సం|| నుండి 10 సం|| వయస్సు కలిగిన పిల్లలు 

2. తల్లిని కోల్పోయిన ఆర్థికంగా వెనుకబడిన 6 సం|| నుండి 10 సం|| వయస్సు కలిగిన పిల్లలు 

3. తండ్రిని కోల్పోయిన ఆర్థికంగా వెనుకబడిన 6 సం|| నుండి 10 సం|| వయస్సు కలిగిన పిల్లలు 

4. మరణ ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం మరియు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయుటకు అర్హులు. 

11వ తరగతి (M.P.C, Bi.P.C, MEA) కోసం 

1. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు 

2. 10 వ తరగతి SSCలో 480 మార్కులు, CBSE లో 400 ఆపైన మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.

3. హీల్ స్కూల్ వారి ప్రవేశ పరీక్ష ఖచ్చితంగా పాస్ కావాలి 

4. తెల్ల రేషన్ కార్డు మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రం

దరఖాస్తు చివరి తేదీ: 7th మార్చి 2025

హీల్ స్కూల్ ప్రత్యేకతలు :

బాలురకు మరియు బాలికలకు ప్రత్యేక వసతి గృహాలు 

విశాలమైన భోజనశాల, సోలార్ వంటగది, 

సేంద్రీయ వ్యవసాయం  మరియు పర్యావరణ స్నేహపూర్వక పద్ధతులు

అత్యుత్తమ అర్హత పొందిన ఉపాధ్యాయులు

అంతర్జాతీయ దూర విద్యా ఫ్యాకల్టీ (DEF)

స్మార్ట్ గదుల్లో ఆన్‌లైన్ తరగతులు

అద్భుతమైన కెమిస్ట్రీ, ఫిజిక్స్, మాథ్స్, బయాలజీ, ఆర్ట్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్స్

15000 పుస్తకాలతో కూడిన లైబ్రరీ 

RO త్రాగు నీరు

వేడి నీటి సౌకర్యం 

పోషకాలతో కూడిన భోజనం 

క్రీడలు & పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సాహించడం 

ఇన్నోవేషన్ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ కేంద్రం

AI ఎక్సలెన్స్ సెంటర్ మరియు సైబర్ సెక్యూరిటీ

3-D ప్రింటింగ్,

డిజైన్ థింకింగ్ 

అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోని,అడ్మిషన్ సాధించటం ద్వారా ఉన్నతమైన భవిష్యత్తును పొందగలరు. ఎంపిక అయిన విద్యార్థులకు హీల్ ఆఫీసు నుండి, వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరు కావలిసిన తేదీ ఫోన్ కాల్ ద్వారా తెలియచేయబడుతుంది .

దరఖాస్తుకు ఆఖరి తేది : మార్చి 18

దరఖాస్తు విధానం : క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌ ద్వారా

పాఠశాల వెబ్‌సైట్‌ : www.healschool.co.in

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు : 9100024435, 9100024438

Heal School Admissions Enquiry Form

2 comments


EmoticonEmoticon

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE