You might be interested in:
PGCIL Recruitment: న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 5న ప్రారంభం కాగా.. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 28
* ఫిల్డ్ సూపర్‌వైజర్ (సేఫ్టీ) పోస్టులు
అర్హత:కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా ఇంజినీరింగ్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్(పవర్)/ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/సివిల్/మెకానికల్/ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25.03.2025 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు:రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్ట్, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పే స్కేల్:నెలకు రూ.23,000 - రూ.1,05,000.
విభాగాలు అండ్ ప్రశ్నల సంఖ్య..
➥ టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ - సంబంధిత విభాగంలో డిప్లొమా సిలబస్ ఆధారంగా 50 ప్రశ్నలు అడుగుతారు.
➥ ఆప్టిట్యూడ్ టెస్ట్ - ఈ క్రింది అంశాలపై తాత్కాలికంగా 25 ప్రశ్నలు అడుగుతారు.
➥ జనరల్ ఇంగ్లీష్: ఆర్టికల్స్, ప్రిపోజిషన్లు, వొకాబులరీ, కాంప్రెహెన్షన్, పర్యాయపదాలు/వ్యతిరేక పదాలు, జంబుల్డ్ వాక్యాలు
➥ రీజనింగ్: డేటా ఇంటర్‌ప్రెటేషన్, కోడింగ్ మరియు డీకోడింగ్, డిడక్టివ్ లాజిక్, ఇండక్టివ్ లాజిక్, డేటా సఫిషియెన్సీ, సిరీస్ కంప్లీషన్, పజిల్స్, ప్యాటర్న్ కంప్లీషన్.
➥ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: రేషియో & ప్రొపొర్షన్, టైం & వర్క్, స్పీడ్ & డిస్టెన్స్, ప్రాఫిట్ & లాస్, సింపుల్ &కాంపౌండ్ ఇంటరెస్ట్, పర్సెంటేజ్, ఆవరేజ్, మెన్సురేషన్, త్రికోణమితి, జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, LCM & HCF, నంబర్స్.
➥ జనరల్ అవేర్‌నెస్: సోషల్ సైన్స్, సైన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్.
➥ నెగిటివ్ మార్కులు లేవు.
➥ అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో స్క్రీనింగ్ టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది.
➥ స్క్రీనింగ్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉంటాయి.
పరీక్షా కేంద్రాలు: ఢిల్లీ NCR, భోపాల్, కోల్‌కతా, బెంగళూరు, గౌహతి, ముంబయి.
ముఖ్యమైన తేదీలు..
🔰? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.03.2025.
🔰? ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.03.2025.
0 comment