You might be interested in:
Sponsored Links
వచ్చే విద్యా సంవత్సరానికి (2025-26) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది (ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి ఆశక్తి ఉన్న విద్యార్ధులు దరఖాస్తులు సమర్పించాలని ఎపిఎస్‌డబ్ల్యూఆర్‌ఇఐ సొసైటీ కార్యదర్శి పి ప్రసన్న వెంకటేష్ తెలిపారు.దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 13వ తేదీ వరకూ పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఎపి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గురుకులాల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైట్ https://apbragcet.apcfss.inను సందర్శించాలని కోరారు.
0 comment