You might be interested in:
శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయపడే కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం. వాటిలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తాం.
ఇందులోనూ ముఖ్యంగా వాళ్లు ఎదగడానికి పోస్టాఫీసు పథకాలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. సుకన్య సమృద్ధి, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వంటి 5 మంచి పథకాలు ఇందులో ఉన్నాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి మార్చి 8న జరుపుకొంటారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా, కొంతమందికి ఆర్థిక స్వేచ్ఛ లేదు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సహాయపడే పథకాలు చూద్దాం. పోస్టాఫీసు ద్వారా నడిచే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు
సుకన్య సమృద్ధి సేవింగ్స్ స్కీమ్ అమ్మాయిల భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా రూపొందించారు. మీ అమ్మాయికి 10 ఏళ్లు నిండకముందే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. దీనిపై 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ ఖాతాను 15 ఏళ్ల వరకు ఆపరేట్ చేయవచ్చు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్
ప్రతి నెలా ఆదాయం కావాలంటే, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బెస్ట్. ఇందులో కనీసం ₹1000 పెట్టుబడి పెట్టాలి. దీనిపై 7.4% వడ్డీ వస్తుంది
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ సురక్షితమైన స్కీమ్. ఇందులో కనీసం ₹100 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ఠం ఎంతనేది లేదు. మీ ఇష్టం. దీని మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు. దీనిపై 7.5% వడ్డీ వస్తుంది.
పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ మంచి ఇన్వెస్ట్‌మెంట్. ఇందులో కనీసం ₹500 ఇన్వెస్ట్ చేయాలి. దీనిపై 7.1% వడ్డీ వస్తుంది.
మహిళా సమ్మాన్ బచత్ పత్ర
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ మహిళల కోసం ఒక స్పెషల్ స్కీమ్. ఇందులో ₹2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. దీనిపై 7.5% వడ్డీ వస్తుంది. ఒక ఏడాది తర్వాత 40% డబ్బు తీసుకోవచ్చు.
0 comment