You might be interested in:
కామ్రేడ్స్! ఈరోజు ఏలూరు జిల్లా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని కలవడం జరిగినది అనేకంశాల మీద చర్చించడం జరిగినది. ఈ ప్రాతినిధ్యంలో యుటిఎఫ్ తరఫునుండి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ బంటు మోహన్రావు పాల్గొన్నారు. క్రింది విషయాలను చర్చించడం జరిగినది.
1. టి ఐ ఎస్ సంబంధించి ఎరెస్టు వైల్ జిల్లాలోని అందరూ టీచర్లు డీఈవో కార్యాలయానికి వచ్చి తప్పులు సరి చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది కనుక డి డి ఓ స్థాయిలో అప్లికేషన్ తీసుకొని డిఈఓ కార్యాలయం పంపించి లాగున కోరాం ఆ విధమైన ప్రయత్నం చేస్తామన్నారు.
2. సీనియార్టీ లిస్టులో ఉన్న తప్పులు సరిచేసుకునే దానికి రేపటి వరకు కూడా పొడిగించాలని అడిగాం ఆ విధంగా తీసుకుంటామని చెప్పారు.
3. ఎంఏ ఎడ్యుకేషన్ కు సంబంధించి క్లారిఫికేషన్ కమిషనర్ నుండి తీసుకోవాలని చెప్పాము అలాగే రాష్ట్ర కమిటీలకు కూడా రేపు జరిగే మీటింగ్లో వివరణ తీసుకోమని కోరడం జరుగుతుంది. డిగ్రీలో జియాలజీ సబ్జెక్ట్ ఆప్షన్ గా ఉన్న వారికి కూడా ప్రమోషన్ సీనియార్టీలో స్థానం కల్పించాలని కోరాం
4. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రమోషన్లకు సంబంధించి పండిట్లకు మాత్రమే ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులకు సంబంధించి ఆ విధంగా సీనియార్టీ లిస్టులు తయారు చేస్తున్నారు ఎస్జీటీ టీచర్లు కూడా ఎవరైనా అదనంగా లాంగ్వేజ్ పండిట్ లేక హిందీ పండిట్ కోర్సులు పూర్తి చేసుంటే వారిని కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు లేక హిందీ ప్రమోషన్లకు అర్హులుగా చేరుస్తారు ఎస్ జి టి లకు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు లేక హిందీ ప్రమోషన్ సీనియార్టీలో చేర్చాలని ఆ మేరకు కమిషనర్ గారికి ప్రాతినిధ్యం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి కోరడం జరుగుతుంది
5. సీనియార్టీ లిస్టులు విషయంలో అనేక సమస్యల మీద డీఈఓ కార్యాలయం వారు కొంత క్లారిటీ ఇచ్చారు వ్యక్తిగతంగా అప్పీల్ చేసుకున్న వారికి కూడా అదే విధమైన క్లారిటీ ఇవ్వమని చెప్పాం ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే పై స్థాయిలో రాష్ట్ర నాయకత్వాన్ని తెలియజేస్తాం.
6. ఎయిడెడ్ పాఠశాలల నుండి వందల సంవత్సరాల క్రితం గ్రాంటు చేసిన సాంక్షన్ ఆర్డర్లు రికగ్నిషన్ ఆర్డర్లు అడగటం వల్ల టీచర్లు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశాం. ఉన్న వాటిని మాత్రమే కరస్పాండెంట్లు వద్ద నుండి తీసుకొని సబ్మిట్ చేస్తారు వాటిని మాత్రమే కమిషనర్ గారి కి పంపాలని కోరాం దానికి ఒప్పుకోవడం జరిగినది.
7. 13వ తేదీ ఆదివారం వర్కింగ్ డే కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల వలన అందరికీ సెలవు ప్రకటించడం వలన 219 వర్కింగ్ డేస్ మాత్రమే వచ్చినవి అది కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఆ మేరకు ఆదివారం పని చేయకుండా చూడాలని కోరాం ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తెలియజేస్తాం ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా డీఈవో గారిని అడిగి పనిచేస్తామని తెలియజేశారని కూడా చెప్పారు ఈ విషయంపై రాష్ట్ర నాయకత్వం నుండి కూడా క్లారిటీ తీసుకుంటాం.
8. జిల్లాలో ప్లస్ టు పాఠశాలలను కొనసాగించాలని అందులో పనిచేసే ప్లస్ ఉపాధ్యాయులను కంటిన్యూ చేయాలని మన జిల్లా నుండి ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేసిన ప్రాతినిధ్యాన్ని కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకు వెళ్ళమని డీఈఓ గారిని కోరాం.
9. టెన్త్ క్లాస్ స్పాట్ వేల్యూషన్ పబ్లిక్ హాలిడేల్లో జరగటం వల్ల ఆ రెండు రోజులకు స్పాట్ లో పాల్గొన్న టీచర్లకు సిసిఎల్ కల్పించాలని కోరాం.
0 comment