బదిలీలు చట్టం ముఖ్యాంశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

బదిలీలు చట్టం ముఖ్యాంశాలు

You might be interested in:

Sponsored Links

2025 మార్చి 9న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీల చట్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్సఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 అని దీనికి పేరు పెట్టారు.

ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, నగరపాలక సంస్థలో పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు.

యాక్ట్ వల్ల నిర్దిష్ట సమయంలో (వేసవి సెలవుల్లోనే) బదిలీలు జరుగుతాయి.

ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి రాబోయే సంవత్సరం మే 31 వరకు ఉన్న కాలాన్ని అకడమిక్ ఇయర్ పరిగణిస్తారు.

మే 31 నాటికి 2 సం||లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీలకు అర్హులు.

పదవీ విరమణ చేసే ఉపాధ్యాయులకు బదిలీ జరిగే సంవత్సరంలో మే 31 నాటికి 2 సం||ల సర్వీస్ మాత్రమే ఉంటే బదిలీ ఐచ్ఛికం.

బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా గ్రేడ్-2 హెడ్మాస్టర్ అందుబాటులో లేకుంటే 50 సంవత్సరాలు మే 31 నాటికి దాటిన పురుష ఉపాధ్యాయులకు ఆ పాఠశాలలో కౌన్సిలింగ్ ద్వారా కోరుకోవడానికి అవకాశం ఇస్తారు.

కంపల్సరీ బదిలీ

ప్రధానోపాధ్యాయులకు 5 సం॥లు, ఉపాధ్యాయులకు 8 సం॥లు ఒకే పాఠశాలలో మే 31 నాటికి సర్వీస్ పూర్తి చేసుకున్న వారు కంపల్సరిగా బదిలీ కిందకు వస్తారు. (ఒక అకడమిక్ ఇయర్లో 9 మాసాలు పూర్తయిన సర్వీస్ని పూర్తి సంవత్సరంగా పరిగణిస్తారు.)

ఒక పాఠశాలలో క్యాడర్తో సంబంధం లేకుండా ప్రధానోపాధ్యాయులు అయితే 5 సం॥లు, ఉపాధ్యాయులకు 8 సం||లు సర్వీసు పూర్తి అయితే కచ్చితంగా బదిలీ కావలసి ఉంటుంది.

పురుష ఉపాధ్యాయులు మే 31 నాటికి 50 సంవత్సరాలు పూర్తికాకుండా ఉండి ప్రస్తుతం బాలికల ఉన్నత

పాఠశాలల్లో పనిచేస్తుంటే వాళ్లు ఖచ్చితంగా ట్రాన్సఫర్ కావలసి ఉంటుంది.

8 సం||లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఎన్సిసి యూనిట్ ఉన్న పాఠశాలలో ఎన్సిసి ఆఫీసర్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరొక ఎన్సిసి యూనిట్ ఉన్న పాఠశాలకు బదిలీల మీద లేదా కంపల్సరీ బదిలీ మీద వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మరొక యూనిట్లో ఖాళీగా లేకుంటే అదే పాఠశాలలో కొనసాగవచ్చు.

ఉపాధ్యాయులపై ఏదైనా డిస్పన్లరీ యాక్షన్ తీసుకొని ఉండి ఉంటే ఖచ్చితంగా వారిని ఆ పాఠశాల నుంచి ట్రాన్సఫర్ చేస్తారు. 

పాఠశాల యూనిట్ గానే సర్వీస్ని పరిగణలోకి తీసుకుంటారు. ఒక సంవత్సరానికి సర్వీస్ పాయింట్స్ 0.5 ఇస్తారు.

16% హెచ్.ఆర్.ఏ. తీసుకుంటున్నవారు కేటగిరి-1, 12% వారు కేటగిరి-2, 10% వారు కేటగిరి-3 క్రింద, రోడ్డు సదుపాయం లేని, హిల్ ఏరియాలో ఉన్న 10% తీసుకుంటున్న వారిని 4వ కేటగిరిగా పరిగణిస్తారు.

క్యాటగిరి-1 ఏరియాకు సంవత్సరానికి ఒక పాయింట్, కేటగిరి-2 ఏరియాకు-2, కేటగిరి-3కు మూడు

పాయింట్స్, కేటగిరి-4 ఏరియాకి 5 పాయింట్స్ని కేటాయిస్తారు.

ఖాళీలు

- ప్రభుత్వం నిర్ధారించిన ఖాళీలు, క్లియర్ వేకెన్సీస్, కంపల్సరీ వేకెన్సీస్, హేతుబద్దీకరణ వేకెన్సీలు, ఒక సంవత్సరంకు పైగా అనధికారికంగా సెలవులో ఉన్న ఉపాధ్యాయుని యొక్క పోస్టు, స్టడీలీవ్లో ఉన్న ఉపాధ్యాయుల వేకెన్సీ, కౌన్సిలింగ్లో ఏర్పడిన ఏరైజింగ్ వేకెన్సీస్లను ఖాళీలుగా పరిగణిస్తారు.

ప్రిఫరెన్షియల్ కేటగిరీ తీసుకుంటున్న ఉపాధ్యాయులలో ఒక పాఠశాలలో 40% ఎస్సీటిలకు మాత్రమే అవకాశం ఇస్తారు. స్కూల్ అసిస్టెంట్లలో 50% ఖాళీలను మాత్రమే పూరిస్తారు. ఒకే సబ్జెక్టు గనుక ఉన్నత పాఠశాలలో ఉంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వరు.

వివిధ అంగవైకల్యం కలిగిన ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో 8 సం||లు పూర్తి అయిన అదే పాఠశాలలో కొనసాగడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం వీరు 8 సం॥లు పూర్తి అయితే తప్పకుండా వేరే పాఠశాలను కోరుకోవలసి ఉంటుంది.

స్పెషల్ పాయింట్స్

కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్లు పనిచేస్తున్న వారు, లోకల్ బాడీస్ లేదా ఎయిడెడ్ ఇన్స్టిస్టిట్యూషన్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయిసికి సంబంధించిన వారికి స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు.

స్పౌజ్ పాయింట్స్కి సంబంధించి ఒకరికి మాత్రమే ప్రధానోపాధ్యాయుల కేడర్లో 5 సం॥లు, మిగిలిన ఉపాధ్యాయ క్యాడర్లో 8 సం॥కి ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశం ఇస్తారు.

40 సంవత్సరాలు పైబడిన అవివాహిత మహిళలకు స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు.

40 శాతం నుండి 55 శాతం వరకు వివిధ అంగవైకల్యం కలవారికి స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు.

56% నుంచి 69% ఉన్న అంగవైకల్యం ఉన్న వారికి స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు.

గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులకు, ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులకు స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు.

విడాకులు తీసుకున్న మహిళకు, ఎక్స్ సర్వీస్మెన్ ఆర్మీ/నేవీ/ఎయిర్ఫోర్స్/ బిఎస్ఎఫ్/ సి.ఆర్.పి.ఎఫ్/సి.ఐ.ఎస్.ఎఫ్ వారి స్పౌజ్కు స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు.

స్కౌట్స్ అండ్ గైడ్ యూనిట్ కనీసం 2 సం॥ల నుండి యూనిట్ కొనసాగిస్తున్న వారికి స్పెషల్ పాయింట్స్ కేటాయిస్తారు.

ఎన్ని పాయింట్స్ కేటాయించాలనేది పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది.

ప్రిఫరెన్షియల్ క్యాటగిరి

70% ఆ పైన వివిధ అంగవైకల్యం కలిగిన వారికి, వితంతువులు, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఆర్గాన్ ట్రాన్సపటేషన్, మేజర్ న్యూరో సర్జరీ, బోన్ టిబి, కిడ్నీ ట్రాన్సపటేషన్ లేదా డయాలసిస్, స్పైనల్ సర్జరీ చేయించుకున్న ఉపాధ్యాయులకు;

మానసిక జబ్బు, జువెనైల్ డయాబెటిస్, తలసేమియా, హిమోఫిలియా, మస్కిలర్ డైస్ ట్రోఫీ, గుండెలో రంద్రం ఉండి గత 3 సం||లలోపు బ్రిటెమెంట్ చేయించుకున్న లేదా సర్జరీ చేసిన జబ్బలతో బాధపడుతూ ప్రస్తుతం ట్రిట్మెంట్ తీసుకుంటున్న పిల్లలు ఉన్న ఉపాద్యాయులకు ప్రిఫరెన్సిల్ కేటగిరి వర్తిస్తుంది.

ఇతర అంశాలు

అన్ని కేడర్ల బదిలీలు ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతాయి.

-స్పెషల్ పాయింట్స్, ప్రిఫరెన్స్ కేటగిరీకి సంబంధించి అందరూ బదిలీలు జరిగే సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధారించిన తేదీలలో మెడికల్ బోర్డు ద్వారా ఫ్రెష్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

- రిక్వెస్ట్ లేదా మ్యూచువల్ లేదా గవర్నమెంట్ బదిలీలు పొందిన ఉపాధ్యాయులకు గత పాఠశాల, ప్రస్తుత పాఠశాల సర్వీసు మొత్తం 8 సం||లు పూర్తి అయితే వాళ్లు కంపల్సరీ బదిలీల పరిధిలోకి వస్తారు.

ఈ చట్టంలో ఉన్న అంశాల పట్ల భిన్నాభిప్రాయం కలిగిన ఉపాధ్యాయులు కోర్టులకు వెళ్లదలుచుకుంటే సంబంధిత అధికారులకు గ్రీవెన్స్ ద్వారా అప్పీలు చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్లాలి. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి.

-బదిలీల కౌన్సిలింగ్లో ఒకే పాయింట్స్ వచ్చిన ఉపాధ్యాయులలో ఎవరు సీనియార్ అని నిర్ణయించడానికి కేడర్లో సీనియార్టీ, డేట్ అఫ్ బర్త్, మహిళను ఆర్డర్లో తీసుకుంటారు.

ప్రమోషన్, రి-ఆపోర్షన్ కి సంబంధించి ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఇస్తారు

బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్

బదిలీలు

-ప్రాథమిక పాఠశాలలను ఎఫ్ఎస్, బిపిఎస్, ఎంపీఎస్ గా మార్చారు.

2025 మార్చి 31 విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎఫ్ఎస్లో 1:30, బి.పి.ఎస్. లో 1:20, ఎంపీఎస్లో ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు.

60లోపు ఉన్న ఎంపీఎస్ లో నలుగురు ఉపాధ్యాయులు, 60 పైన ఉంటే ఐదుగురు, 100కు పైబడి ఉంటే అదనంగా పిఎస్ హెచ్ఎంని కేటాయిస్తారు.

యూపీ పాఠశాలలో 1:30 ఆధారంగా ఎస్జీటీలను మాత్రమే కేటాయిస్తారు.

ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి పది తరగతులను పెట్టాలని ప్రతిపాదిస్తున్నారు.

ఈ పాఠశాలలోని ప్రాథమిక తరగతులకు ఒకటి నుంచి పది వరకు విద్యార్థులు ఉంటే ఇద్దరు ఎస్.జి.టి.లు, 11 నుంచి 31 వరకు ఉంటే ముగ్గురు ఎస్.జి.టి.లు, 31 నుంచి 40 వరకు ఉంటే నలుగురు ఉంటారు.

- ప్రస్తుతం రాష్ట్రంలో ఎఫ్ఎస్లు 5వేల పాఠశాలలు, బీపీఎస్లు 19వేల పాఠశాలలు, ఎంపీఎస్ 9,200గా మారనున్నాయి.

-రాష్ట్రంలో 1-10 తరగతిలో ఉన్న పాఠశాలలు 1557, 6-10 తరగతులను ఉన్నత పాఠశాలలో 5000, 900 యూపీ పాఠశాల అప్గ్రేడ్ చేశారు. 1200 యూపీ పాఠశాలలు అలాగే కొనసాగుతాయి.

స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7900 దాకా సర్ ప్లస్ గా మారుతున్నాయి.

ఇలా మారుతున్న స్కూల్ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలలోని ఎం.పి.ఎస్.లకు, ప్రాథమిక పాఠశాలలోని ఎం.పి.ఎస్. హెచ్ఎంలుగా నియమిస్తారు.

ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రమోషన్లు ఇకనుంచి ఇవ్వరు. ఈ పోస్టులు 2016 లోనే రద్దు అయ్యాయి. పోస్టులను బ్లాక్ చేయరు.

రేషనల్ గురయ్యే వారికి ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ లేదా రేషనలైజేషన్ పాయింట్లు ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు.

ఉన్నత పాఠశాలలో 1:53ని ఒక సెక్షన్ గా ఉంటుంది.

ఏ యాజమాన్యానికి ఆ, యాజమాన్యంలోనే బదిలీలు ఉంటాయి.

-ప్లస్ టు పాఠశాలలో పనిచేస్తూ ప్లస్ 2 విద్యార్థులకు బోధిస్తున్న వారు అదే పాఠశాలలో 8 సంవత్సరాల సర్వీసు పూర్తి అయితే కంపల్సరీ బదిలీ కావాలి. 8 సంవత్సరాల సర్వీసు పూర్తి చేయకపోతే అదే పాఠశాలలో కొనసాగవచ్చు లేదా బదిలీ కావచ్చు.

-జీవో 77ను కోర్టు నిలుపుదల చేసింది. దీనివల్ల అర్హత కలిగిన ఎస్.జి.టి.లకు తెలుగు, హిందీ పండిట్ పోస్టులు ప్రమోషన్లు రావు.

- స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులుగా 2260 పోస్టులు పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ పోస్టులన్నీ డీఎస్సీలో మాత్రమే చూపుతారు. ap teachers news

ప్రమోషన్స్

-మెరిట్ ఆధారంగా సీనియారిటీ లిస్టులు తయారుచేస్తారు. ప్రమోషన్స్ ఇచ్చే సందర్భంలో మెరిట్ కం రోస్టర్ తయారు చేసి దాని ప్రకారం ప్రమోషన్ ఇస్తారు.

రిలీవర్ రానివారు కొత్త పాఠశాలలో వచ్చేదాకా పాత పాఠశాలలోనే పనిచేయాలి.

-మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అన్ని పోస్టులు అప్గ్రేడ్ చేస్తారు.

హెచ్ఎంల బదిలీలు అనంతరం ప్రమోషన్లు చేపడతారు. తదుపరి స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు అనంతరం స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు ఇస్తారు. తదుపరి ఎస్.జి.టి.ల బదిలీలు ఆ పైన ఎస్.జి.టి.ల ప్రమోషన్లు ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత డిఎస్సీ నియామకాలు చేపడతారు.

బదిలీలు ప్రమోషన్ల కోరుకున్న వారు మే 31 నాటికి కొత్త పాఠశాలలో చేశారు.

- డిఎస్సీ నియమకాలు ఆగస్టు 1 వతేది పాఠశాలలో చేరే విధంగా నిర్వహిస్తారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE