You might be interested in:
కామ్రేడ్స్!
ఈ రోజు విద్యాశాఖ అధికారులుతో జరిగిన సమావేశపు ముఖ్యాంశాలు:
1. UP స్కూల్స్ కు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయిస్తారు ( ఇప్పటికే MEO లకు డైరెక్షన్ ఇచ్చారు)
2. పోస్టుల రేషనలైజేషన్, స్కూల్స్ అప్ గ్రేడేషన్ తుది సమచారం జిల్లాల నుండి వచ్చిన వెంటనే ఈ నెలాఖరు నాటికి బదిలీ ఉత్తర్వులు ఇస్తారు.
3. ఉపాధ్యాయుల పోస్టుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మిగిలిన ఉపాధ్యాయులను క్లస్టర్ పూల్ లో ఉంచి; రిటైర్మెంట్లు మెటర్నిటీ సెలవులు, దీర్ఘకాలిక సెలవులు పెట్టేవారి స్థానాలలో పనిచేయిస్తారు.
4. మే నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు.
5. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పోస్టులలో SGT లకు ప్రమోషన్ ఇచ్చే విషయమై శాశ్వత పరిష్కారం దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. భవిష్యత్ లో LP పోస్టుల భర్తీ ఉండదు కనుక 30:70 నిష్పత్తిలో SGT లకు ప్రమోషన్ ఇచ్చే విషయమై ఆలోచన జరుగుతున్నది.
6. జూన్ 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉపాధ్యాయులందరికీ ట్రైనింగ్ నిర్వహిస్తారు.
7. LEAP యాప్ లో ఏవైనా ఇబ్బందులు ఉంటే డైరెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
8. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో మెడికల్ సర్టిఫికెట్లు పొందేవారికి ఈ సంవత్సరం మాత్రమే యూజర్ చార్జీలు వసూలు చేయబడవు.
9. 40-55% అంగవైకల్యం కలిగి వికలాంగుల కోటాలో ఉద్యోగం పొందిన వారు తమ అంగవైకల్యంలో ఎటువంటి మార్పు లేకపోతే మెడికల్ సర్టిఫికెట్ కొత్తగా తీసుకోక పోయినా బదిలీలలో పాయింట్లు కేటాయిస్తారు. కాని, వారు తమ సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకోవాలి. 55% పైబడి అంగవైకల్యం కలిగిన వారు మాత్రం తప్పనిసరిగా కొత్త సర్టిఫికెట్లు తీసుకోవాలి.
10. ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులను ఎక్కువ రోలు ఉన్న పాఠశాలలకు కేటాయిస్తారు.
- APUTF
0 comment