DSC కి ఉచిత కోచింగ్ దరఖాస్తులు ఆహ్వానం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

DSC కి ఉచిత కోచింగ్ దరఖాస్తులు ఆహ్వానం

You might be interested in:

Sponsored Links

 వె.త.సం. శాఖ


కృష్ణాజిల్లా - "మెగా DSC -2025 రిక్రూట్మెంట్" పరీక్షలకు హాజరగు బి.సి., ఈ.డబ్ల్యు.యెస్. (ఇ.బి.సి.), ఎస్.సి, ఎస్.టి మరియు మైనారిటీ కులములకు చెందిన అభ్యర్ధులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చుటకు గ్రామ, పట్టణ మరియు మండలాలలో ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకొనుటకు సమాచారమును తెలుపుట గురించి. పూర్తి

సూచిక:-

1. మెమో.నెం.B/3126/2024, తేది. 06.03.2025, సందాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ.

2. కార్యాలయం ఉత్తర్వులు..A9/45/2024, 10.07.03.2025, 0.25.03.2025, 04.04.2025 2 09.04.2025.

3. సందాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి నుండి Zoom మీటింగ్ ద్వారా అందిన మౌఖిక ఆదేశములు.

4. కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, కృష్ణాజిల్లా వారి నోటు ఉత్తర్వులు తేది.17.04.2025.

పై సూచిక 1 ద్వారా సంచాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు "మెగా DSC- 2025 రిక్రూట్మెంట్" పరీక్షలకు కృష్ణాజిల్లా నుండి 200 మంది అభ్యర్ధులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చుటకు అవకాశము కల్పిస్తూ ఈ క్రింది అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు స్వీకరించవలసిందిగా తెలియచేసియున్నారు.

పై సూచిక 2 ద్వారా పలుమార్లు అన్ని తెలుగు దిన పత్రికలలో ప్రచురించుట జరిగినది, కానీ ది.15.04.2025 నాటికి కృష్ణాజిల్లా నుండి 44 మంది అభ్యర్ధులు మాత్రమే ధరఖాస్తు చేసుకొనుట జరిగినది.

పై సూచిక 3 ద్వారా సందాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు దరఖాస్తులు తక్కువ వచ్చుట వలన అర్హత కలిగిన అభ్యర్ధులకు మరియొక అవకాశము కల్పిస్తూ ఎక్కువ మంది అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొనుటకు జిల్లాలోని అధికారుల ద్వారా మరియు వివిధ మాధ్యమాల ద్వారా పూర్తి వివరములను గ్రామ, పట్టణ మరియు మండలాలలో ఉన్న అభ్యర్ధులకు DSC-2025 పరీక్షలకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణకు సంబందించిన సమాచారమును తెలియచేయవలసినదిగా ఆదేశించియున్నారు.

ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ పొందగోరు అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండవలెను:-

1. TET అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

2. బి.సి. ఈ.డబ్ల్యు.యస్.(ఇ.బి.సి.), ఎస్.సి, ఎస్.టి మరియు మైనారిటీ కులములకు చెందిన అర్హత కలిగిన మరియు ఆసక్తిగల అభ్యర్ధులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలి.

3. ధరఖాస్తు చేసుకొను అభ్యర్ధులు కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికేట్ మరియు TET పరీక్షలో అర్హత సాధించిన ధ్రువ పత్రములు సమర్పించవలెను.

కావున, సంబందిత అధికారులకు తెలియచేయునది ఏమనగా, మీ క్రింది స్థాయి అధికారుల ద్వారా వారి పరిధిలోగల గ్రామ, పట్టణ మరియు మండలాలలో "మెగా DSC- 2025 రిక్రూట్మెంట్" పరీక్షలకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకొనుటకు TET ఉత్తీర్ణత సాదించిన అర్హత కలిగిన అభ్యర్ధులకు ఈ సమాచారమును తెలియచేయవలసినదిగా ఆదేశించడమైనది. ఇందుతో పాటుగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకొనుటకు ధరఖాస్తు ఫారమును జత చేయడమైనది.

Download Complete Notification and Application

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE