Mega DSC మెగా డీఎస్సీ సందేహాలు సమాధానాలు– Frequently Asked Questions (FAQs) - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

Mega DSC మెగా డీఎస్సీ సందేహాలు సమాధానాలు– Frequently Asked Questions (FAQs)

You might be interested in:

Sponsored Links

1. ప్రస్తుత మెగా డీఎస్సీలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తున్నారు?

జ) మెగా డీఎస్సీ ద్వారా 16347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

2. ఈ పోస్టులు ఏ ఏ యాజమాన్యాల లో ఉంటాయి?

జ) ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, జువనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేస్తారు.

3. యాజమాన్యాల వారీగా ఖాళీల వివరాలను తెలపండి.?

1.MP, ZP, Municipal and Municipal corporation - 13192

2 APMS - 286

3.APREIS - 190

4.APSWREIS - 439

5.BCWREIS - 170

6.TW Ashram - 881

7.TW Gurukulam - 1143

8.Welfare of Differently Abled - 31

9 .Juvenile Welfare - 15

Total: 16347

4. మెగా డీఎస్సీ ద్వారా నింప పోతున్న పోస్టుల వివరాలు తెలపండి?

జ) మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారు

>సెకండరీ గ్రేడ్ టీచర్స (సాధారణ పాఠశాలలు)

> స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ (సాధారణ పాఠశాలలు)

>సెకండరీ గ్రేడ్ టీచర్స (స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలలు)

> ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేషన్- ప్రత్యేక పాఠశాలలు )

> ఫిసికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేషన్- ప్రత్యేక పాఠశాలలు )

> పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (సొసైటీ పాఠశాలలు)

> ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (సొసైటీ పాఠశాలలు)

> ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (సొసైటీ పాఠశాలలు)

> ఫిజికల్ డైరెక్టర్స్ (సొసైటీ పాఠశాలలు)

> ప్రిన్సిపాల్ (సొసైటీ పాఠశాలలు)

5. మెగా డీఎస్సీలో అప్లికేషన్ నింపడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

జ) మెగా డీఎస్సీ అప్లికేషన్ లో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండవ భాగంలో విద్యా అర్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడవ విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. ఒకటి రెండు విభాగాలలోని అంశాలను అభ్యర్థి ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చ. దరఖాస్తు ఫారం లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. మూడు విభాగాలలోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన మరియు ఎపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒకొక్క పోస్టుకు రూ. 750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడవ విభాగం లో ఎలాంటి సవరణలకు అవకాశం లేదు

6. గత డీఎస్సీలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించవలసిన అవసరం ఉందా?

జ) గత డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయదలచినట్లయితే ఆ పోస్టులకు మాత్రమే పోస్టుకు 750 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

7. దరఖాస్తు నింపడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది?

జ) మెగా డీఎస్సీ అభ్యర్థులు 20-04-2025 తేదీ నుండి 15-05-2025 తేదీ వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు నింపుకోవచ్చు.

8. మెగా డీఎస్సీ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఏమి చేయాలి?

జ) మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in /https://apdsc.apcfss.in వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులిటన్స్, సిలబస్, ఖాళీల వివరాలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

9. మెగా డిఎస్సి రాయాలంటే టెట్ లో కనీస అర్హత మార్కులు ఎన్ని ?

జ) ఓసీ అభ్యర్థులు 60% (90 మార్కులు) బిసి అభ్యర్థులు 50% (75 మార్కులు), యస్.సి, ఎస్.టి, వికలాంగ అభ్యర్థులు 40% (60 మార్కులు) కనీస అర్హత మార్కులు పొందాలి

10. అభ్యర్థి తన సర్టిఫికెట్లను ఎప్పుడు అప్లోడ్ చేయాలి ?

జ) అభ్యర్థి దరఖాస్తును నింపిన తరువాత అభ్యర్థి తప్పనిసరిగా తన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.

11. మెగా డిఎస్సి లో రిజర్వేషన్లు ఎలా అమలు పరుస్తారు?

జ) జి ఓ 77 dt : 02-08-2023, సాధారణ పరిపాలన శాఖ ఇచ్చే తదుపరి ఉత్తర్వులను అనుసరించి వర్టికల్ మరియు హారిజాన్టల్ రిజర్వేషన్లు అమలు పరుస్తారు. హారిజాన్టల్ 8 4 2 (woman, PwBD, Ex - Service man, Sports) ముందుగా కేటాయింపబడవు. అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు లోనుకావద్దు.

12. హారిజాన్టల్ రిజర్వేషన్లో మహిళలకు రిజర్వేషన్ ఏవిధంగా అమలుచేస్తారు?

జ) 100 సైకిల్ హారిజాన్టల్ రిజర్వేషన్ అమలుజరుగుతుంది. జి ఓ 77 dt: 02-08-2023, ຜູ້ ລ້ ຕູ້ 5 ລ້ (woman, PwBD, Ex Service man, Sports) విభాగాలకు రోస్టర్ పాయింట్లను ముందుగా నిర్దారించకుండా అమలు చేయడం జరుగుతుంది

13. దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హతగల పోస్టులకు ఆప్షన్ ఎంపిక ఎలా చేసుకోవాలి?

జ) అభ్యర్థి తన విద్యార్హతలు బట్టి ఏయే పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్టువేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని (ఆప్షన్లు) ఎంపిక చేసుకున్న తరువాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థి జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

14. మొదటి పోస్టుప్రాధాన్యత క్రమా నికి (ఆప్షన్ కు) అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక వుద్యోగం రాదా?

జ) అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టుప్రాధాన్యత క్రమా నికి ఆప్షన్ కు ఎంపిక కాకపోతే అతని పేరు రెండవ ఆప్షన్ కు బదిలీ అవుతుంది. అదికూడా రాకపోతే మూడవ ఆప్షన్ కు బదిలీ అవుతుంది. ఈ విధముగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్ కు ఎంపికైతే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి. ఒక పోస్టుకు ఎంపికైన తరువాత ఎట్టి పరిస్థితులలోనూ పోస్ట్ మార్చుకోడానికి అవకాశం లేదు.

15 మెగా డి యస్ సి కి వయోపరిమితి ఏమిటి?

జ) 01-07-2024 నాటికీ 18 సంవత్సరాలకన్నా తక్కువ 44 సంవత్సరాలకన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వుడు కేటగిరి అభ్యర్థుల గరిష్ట వయస్సు 49 సంవత్సరాలు, దివ్యంగులకు గరిష్ట వయస్సు 54 సంవత్సరాలుగా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మన్ విభాగంలో నిభందనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

16 షెడ్యూల్డు కులాల వర్గీకరణను ఎలా అమలుచేస్తారు?

జ) రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాల వర్గీకరణకై విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర సంఖ్య 7, తేదీ 18-04-2025, సాధారణ పరిపాలన శాఖ నియమావళి ఆధారముగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 విభాగాలు గా నిర్ధారిత శాతం మేరకు షెడ్యూలు కులాల రిజర్వేషన్ అమలు జరుగుతుంది

17. మెగా డిఎస్సి లో స్పోర్ట్స్ కోటా ఎలా అమలుచేస్తారు?

జ) ప్రభుత్వ ఉత్తరు సంఖ్య. 00 తేదీ 00-04-2025 మేరకు రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అభ్యర్థుల అర్హతల మేరకు 3 % స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

18. అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలి ?

జ) మెగా డి యస్ సి లో దరఖాస్తు చేయడం హాల్ టికెట్ పరీక్షా కేంద్రాలు తదితరాల గురించి సహాయంకోసం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. ఫోన్ నంబర్లు ఇన్ఫర్మేషన్ బులిటన్ ఇవ్వబడ్డాయి.

19. ఏయే జిల్లాల్లో మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువగా వున్నాయి?

జ) మెగా డిఎస్సి లో ప్రకటించిన 16347 పోస్టులలో 2678 పోస్టులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది.

20. మెగా డిఎస్ సి -2025 సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి?

జ) అభ్యర్థుల సౌకర్యం కోసం గత సంవత్సరం నవంబరు నెలలోనే పోస్టుల వారీగా సిలబస్, ప్రశ్నపత్రం మార్కుల స్వరూపం గురించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం వెబ్సైటు .. లో అందుబాటులో ఉంచడం జరిగింది.

AP Mega DSC సందేహాలు సమాధానాలు

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE