Published : June 29, 2025
You might be interested in:
Sponsored Links
నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2025-26 విద్యా సంవత్స రానికి ప్రవేశాల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. జూన్ 30, జులై 1 తేదీల్లో నిర్వ హించే ఈ కార్యక్రమంలో మొదటి రోజు 505 మందికి, రెండో రోజున 550 మందికి కాల్ లెటర్స్ పంపినట్లు చెప్పారు. బాస్కెట్ బాల్ కోర్టు ఆవరణలో రిజిస్ట్రేషన్, ఆడిటోరియంలో దరఖాస్తులను పూరించడం, కేటగిరీ, అకడమిక్ పరిశీలన, సీట్ కేటాయింపు, డాటా ఎంట్రీ, ధ్రువపత్రాలు తీసుకోవడం, గుర్తింపు కార్డు పంపిణీకి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
0 comment