గౌరవ కమీషనర్ గారి వెబెక్స్ మీటింగ్ ఆదేశాలు :- (02.07.25) - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

గౌరవ కమీషనర్ గారి వెబెక్స్ మీటింగ్ ఆదేశాలు :- (02.07.25)

You might be interested in:

Sponsored Links

గౌరవ కమీషనర్ గారి వెబెక్స్ మీటింగ్ ఆదేశాలు :- (02.07.25)

1. క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో, ఉపాధ్యాయులతో, ఉపాధ్యాయేతర సిబ్బంది ఫోన్ నంబర్స్y తో వాట్సాప్ యాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి.

2. ప్రతి ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలలో తల్లికి వందనం పై పిల్లలకు పోటీలు నిర్వహించి ఉండాలి. నిర్వహించని వారు వెంటనే నిర్వహించాలి.

3. మొక్కలు నాటి పెంచడానికి ముందుకు వచ్చే విద్యార్థుల పేర్లు సిద్ధంగా ఉండాలి. LEAP యాప్ లో వివరాలు అప్లోడ్ చేయాలి.(Ek ped మా కా నామ్)

4. టీచర్స్ హ్యాండ్ బుక్స్ ఈ వారంలో రాబోతున్నాయి.

5. HPC కార్డ్స్ రాబోతున్నాయి.

6. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.

7. డైట్ స్టాఫ్ మరియు స్టూడెంట్స్ వారానికి రెండు రోజుల పాటు పాఠశాలలను సందర్శించాలి. FLN అమలు పై, బోగస్ అటెండన్స్ పై పరిశీలన చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. 

8. డైట్ ఫాకల్టీ మరియు స్టూడెంట్స్ ద్వారా క్లస్టర్ లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. 

9. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థి ప్రతి రోజు కనీసం ఒక నాలుగు మార్కుల ప్రశ్నకు జవాబు వ్రాసేవిధంగా చూడాలి.

10. ప్రతి ప్రాథమిక పాఠశాల విద్యార్థి ప్రతి రోజు కనీసం నాలుగు లైన్స్ వ్రాసేటట్లు చూడాలి.

11. MEOs, Cluster Schools HMs, CRMTs వారానికి రెండు రోజులు ఫీజికల్ మీటింగ్ ద్వారా కలిసి పాఠశాలల మెరిట్స్, డి మెరిట్స్ పై చర్చించి, పాఠశాలల అభివృద్దికి సపోర్ట్ చేయాలి.

12. ప్రతి cluster పరిధిలో SGT ల నుండి, Subject వారీ SA ల నుండి కొంత మంది subject ఎక్స్పర్ట్స్ ను గుర్తించాలి. డైట్ ఫాకల్టీ, స్టూడెంట్స్ తో వీరిని అనుసంధానం చేయాలి. Cluster లెవెల్ మీటింగ్స్ సమర్ధవంతంగా నిర్వహించాలి.

13. SCERT ఫాకల్టీ ని కూడా జిల్లాల ఇంచార్జెస్ గా, పరిశీలకులుగా నియమించాలి.

14. లెసన్ చెప్పడం పూర్తి అయిన పిదప సమ్మరీ వీడియోస్ తప్పనిసరిగా చూడాలి. 

15. ఆగష్టు 4 న FA 1 పరీక్షలు ప్రారంభం కాబోతున్నందున సిలబస్ ఇన్ టైం లో పూర్తిచేసి, విద్యార్థులకు తగిన ప్రాక్టీస్ చేయించాలి.

16. ఖచ్చితమైన వివరాలతో UDISE డేటా ఉండాలి. పేరెంట్స్ ఫోన్ నంబర్స్ కరెక్ట్ గా నమోదుచేయాలి.

17. Cluster HMs వద్ద వారి cluster పరిధిలోని అన్ని పాఠశాలల వివరాలు ఉండడంతో పాటు, అధికారులు అడిగినప్పుడు వెంటనే చెప్పగలిగే విధంగా ఉండాలి.

18. మండల విద్యాశాఖధికారుల వద్ద మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలలో పదవ తరగతి బాలుర బాలికల వివరాలు సిద్ధంగా ఉండాలి. అధికారులు అడిగినప్పుడు పేపర్ చూడకుండా చెప్పగలిగే విధంగా ఉండాలి. 10th రిజల్ట్స్ పక్కాగా వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం అమలుచేయాలి.

19. పెండింగ్ ఉన్న విద్యార్థులకు APAAR ID లు వెంటనే క్రియేట్ అయ్యే విధంగా చూడాలి.

20. CLUSTER HM లు క్లస్టర్ లెవెల్ అకడమిక్ మానిటరింగ్ మానిటరింగ్ ఆఫీసర్లు గా వ్యవహారించాలి.

21. పాఠశాలల డేటా ఎంట్రీ క్లస్టర్ పాఠశాలలలో లేదా MEO ఆఫీస్ లో జరిగేటట్లు చూడాలి.

22. ఇప్పటి నుండి ఎ ఉపాధ్యాయులైతే తక్కువ సెలవులు వినియోగించుకుని, విద్యాభివృద్ధికి పాటుపడతారో వారికి మాత్రమే బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.

23. Mega PTM సందర్బంగా అన్ని పాఠశాలలలో ఫోటో బూత్ ఏర్పాటుచేయాలి. ప్రతి విద్యార్థికి వారి తల్లిదండ్రులతో ఫోటో తీయాలి.

24. హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా హెల్త్ కార్డ్స్ కూడా సప్లై చేయబడతాయి.

25. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే బాధ్యత విద్యార్థులకు ఇవ్వరాదు. విద్యార్థులు వారి ఇంటి ఆవరణంలో గాని, పబ్లిక్ ప్లేసెస్ లో గాని మాత్రమే మొక్కలు నాటి సంరక్షించాలి.(4th క్లాస్ to 10th క్లాస్ విద్యార్థులు మాత్రమే). మొక్కలు నాటి పెంచిన విద్యార్థులకు Green Passport అవార్డులు ఇవ్వడం జరుగుతుంది.

26. Mega PTM రోజు విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులలో ఒకరు హాజరవుతారు కనుక ఎగ్స్ ఒక విద్యార్థికి రెండు చొప్పున కేటాయించాలి. విద్యార్థులతో పాటు హాజరైన కుటుంబ సభ్యులకు కూడా రాగి జావా ఇవ్వాలి.

26. Mega PTM పూర్తి అయిన వెంటనే స్టూడెంట్స్ కిట్స్ బయోమెట్రిక్ authentication పూర్తిచేయాలి.

27. Transition గ్యాప్ లేకుండా చూడాలి.

28. బోగస్ ఎన్రోల్మెంట్ లేకుండా చూడాలి.

29. టీచర్స్, స్టూడెంట్స్ అటెండన్స్ ఇన్ టైం లో కంప్లీట్ చేయాలి.

30. 12(1)(c) admissions పూర్తిచేయాలి.

31. విద్యార్థులందరూ పూర్తి స్థాయి స్టూడెంట్స్ కిట్స్ తో Mega PTM రోజు పాఠశాలలకు హాజయ్యే విధంగా కృషిచేయాలి. యూనిఫామ్ స్టిచ్చింగ్ పై రోజువారీ రివ్యూ నిర్వహించాలి.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE