జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమం గురించి పత్రికా ప్రకటన - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమం గురించి పత్రికా ప్రకటన

You might be interested in:

Sponsored Links

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా

పత్రికా ప్రకటన (01.07.2025)

జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమం

విజయవంతం దిశగా జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు 

మార్గదర్శకాలు విడుదల చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు

రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలలో ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఆదేశాల మేరకు ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమం విజయవంతం చేయడానికి సన్నాహక చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు సమగ్ర శిక్షా అదనపు జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు,  జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆర్జేడీలకు, జిల్లా కలెక్టర్లకు కార్యక్రమ నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆర్జేడీలు తమ పరిధిలో జిల్లా విద్యాశాఖాధికారులు, ఏపీసీలతో, మండల విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకుని, నిశితంగా పర్యవేక్షించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,  కోరారు. జూలై 5న జరగాల్సిన ఈ మెగా పీటీఎం కార్యక్రమం జూలై 10వ తేదీన జరపడానికి ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ విజయ్ రామరాజు.వి IAS., గారు, సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్జేడీ, డీఈవో, ఏపీసీలు, తదితర అధికారులకు సూచనలు చేశారు.

మార్గదర్శకాలలో ముఖ్యాంశాలివీ...

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని, పాఠశాల విద్యా శాఖ, సమాజ భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 (RTE) , జాతీయ విద్యా విధానం, 2020 (NEP) విద్యా పురోగతి కోసం ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు.

*  పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక కీలక వేదికగా పని చేస్తుంది. 

* PTMలు తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా పురోగతి, ప్రవర్తన, సామాజిక సమస్యల గురించి అవగాహన చేసుకోవడానికి సహాయ పడతాయి, అదే సమయంలో ఉపాధ్యాయులు పిల్లల ప్రయోజనం కోసం తల్లిదండ్రుల సహకారాన్ని కోరడానికి వీలు కల్పిస్తాయి.

* ఈ సహకార ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లను (మెగా PTMలు) వేడుకగా నిర్వహించాలని సంకల్పించింది. 

* మెగా PTM తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వారధి. తద్వారా ప్రతి పిల్లవాడికి ఫలితాలను మెరుగు పరచడానికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. 

* భారతదేశంలో మొట్ట మొదటిసారి డిసెంబర్7, 2024న జరిగిన బృహత్ కార్యక్రమం మెగాపీటీఎం. ఈ కార్యక్రమంలో 44,956 పాఠశాలల్లో 25.46 లక్షలమంది తల్లిదండ్రులు, 27,395 మంది పూర్వ విద్యార్థులు, 22,200 మంది దాతలు, 36,918 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. 

* ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులంతా అంకితభావంతో పని చేయడం వలనే ఇంత పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమం విజయవంతం కావడానికి కారణమైంది. వారికి అభినందనలు. 

* ఈ విజయం ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి 10.07.2025న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0 (మెగా PTM 2.0) ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించ బడుతుంది. పెద్ద ఎత్తున సమాజ భాగస్వామ్యం కావడమే ఈ గొప్ప కార్యక్రమ లక్ష్యం. 

* జూలై 10వ తేదీన 61,135 విద్యా సంస్థల్లో  జరిగే ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమంలో దాదాపు 2,28,21,454 మంది (74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు, తదితరులు 1,49,92,456 ) పాల్గొననున్నారు.   

మెగా PTM 2.0 కార్యక్రమంలో...

* ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమగ్ర పురోగతి కార్డులను (Holistic Progress Cards) అందిస్తారు. తద్వారా ప్రతి బిడ్డ విద్యా పురోగతి తెలుసుకుంటారు. 

* ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సమావేశంలో పాఠశాల విద్యాపరమైన పనితీరు, మౌలిక సదుపాయాల లోపాలు, కార్యాచరణ ప్రణాళికలను తెలియ జేస్తారు. 

* సరదా కార్యకలాపాలు, ఆటలు ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరు తల్లిదండ్రుల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించ వచ్చు. 

* విద్యార్థుల, పాఠశాలల విజయ గాథలను ప్రశంసిస్తారు.

కార్యక్రమంలో భాగంగా:

* ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఫోటో బూత్‌లు, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్‌లు, ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో మొక్క నాటడం) భాగంగా గ్రీన్ పాస్‌పోర్ట్ ఉన్నాయి.

* ఆసక్తిగల విద్యార్థులు మొక్కలు సరఫరా చేయడానికి నమోదు చేసుకోవడానికి ‘లీప్ యాప్’ అందుబాటులో ఉంది. 

* మానసిక ఆరోగ్యం, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్‌లు ఉంటాయి.

రాష్ట్ర పథక సంచాలకులు (వారి తరఫున)

సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Press Note

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE