You might be interested in:
మెగా PTM 2.0 నిర్వహించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు (School Head) /ప్రిన్సిపాల్స్ కొరకు మార్గదర్శకాలు:
ప్రియమైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు,
సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని, ఐలంగా విశ్వసించే మన ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు మాస్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాభివృద్ధిలో కూడా సమాజం కీలక భాగస్వామి కావాలన్నదే వారి ప్రధాన ఆకాంక్ష. పేదరికంలేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా, ఈ మేరకు విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య సంబంధాలను బలపరచడం ద్వారా మన ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి రాబోవు, 2047 సంవత్సరాంతానికి వికసిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే పేరెంట్' టీచర్స్ మీటింగ్ (మెగా PTM 2.0) ని దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించారు.
2009 సంవత్సరంలో భారత ప్రభుత్వం మన పిల్లల కొరకు "బాలల ఉచిత, నిర్భంద విద్యా హక్కు చట్టం (ఆర్.టి.ఈ)" తీసుకొచ్చింది. దేశంలోని 6-14 సంవత్సరాలలోపు వయస్సు పిల్లలందరికీ, ఉచిత, నిర్బంద విద్యను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచే క్రమంలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించి పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ (మెగా PTM 2.0) ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించింది. ఇదే విషయాన్ని జాతీయ విద్యా విధానం (NEP) 2020 కూడా నొక్కి వక్కాణించింది.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం(మెగా PTM 2.0) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిన కీలకమైన కార్యక్రమం. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తనా పరంగా ఏ స్థాయిలో ఉన్నారో మరియు సమాజ అంశాల పట్ల ఎలాంటి అవగాహనా కలిగి ఉన్నారో తెలుసుకోవడంతోపాటు, అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల ప్రయోజనాలకోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు, అదేవిధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నుండి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలుసుకునేందుకు ఒక మంచి వేదిక.గత సంవత్సరం జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ (మెగా పిటిఎం) ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు గ్రామ సభ్యులందరి సహకారం మరియు సహకారంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మీ అందరి సహకారం లేకుండా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేది కాదు. అదేవిధంగా, ఈ సంవత్సరం మెగా PTM 2.0 ను గత సంవత్సరం కంటే మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇందులో 61,135 ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు సుమారు 75 లక్షల మంది విద్యార్థులతో భాగస్వామ్యం కానున్నాయి.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించడానికి కావలసిన సవివరమైన మార్గదర్శకాలను ఈ క్రింద పొందుపరచడం జరిగింది. జాగ్రత్తగా పాటించండి. ఈ మార్గదర్శకాలు LEAP యాప్ లోని PTM మాడ్యూల్ లోని "Invitees tile" లో "Instructions" బటన్ క్లిక్ చేసి పొందగలరు.
PTM 2.0 Useful Videos
సంఖ్య | అంశం | డౌన్లోడ్ LINK |
---|---|---|
1 | ప్రాధమిక పాఠశాలల స్కూల్ హెడ్ సందేశం | LINK |
2 | ప్రాధమిక పాఠశాలల టీచర్ సందేశం | LINK |
3 | సెకండరీ పాఠశాలల స్కూల్ హెడ్ సందేశం | LINK |
4 | సెకండరీ పాఠశాలల టీచర్ సందేశం | LINK |
5 | "సే నో టు డ్రగ్స్" పామ్ ప్లెట్ & పోస్టర్స్ | LINK |
6 | మదర్స్ రైట్ - ఆప్స్ | LINK |
7 | నవతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి మిత్ర - SOP | LINK |
8 | ప్రజా ప్రతినిధులకు సూచనలు | LINK |
Primary Minitue to Minitue Programme
0 comment