You might be interested in:
BSF Sports Quota
BSF Sports Quota Recruitment 2025 – 391 కానిస్టేబుల్ (GD) పోస్టులు | rectt.bsf.gov.in ఆన్‌లైన్ దరఖాస్తు
Recruitment 2025 కింద 391 కానిస్టేబుల్ (GD) పోస్టులకు దరఖాస్తు చేయండి. అర్హతలు, వయో పరిమితి, ఫీజు, ఎంపిక విధానం, మరియు అధికారిక నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ చూడండి. చివరి తేదీ: 04 నవంబర్ 2025. సరిహద్దు భద్రతా దళం (BSF) – గృహ వ్యవహారాల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడల్లో ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి ఆహ్వానం పలికింది.మొత్తం 391 ఖాళీలు BSF Sports Quota కింద నింపబడనున్నాయి. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అర్హులు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభం: 16 అక్టోబర్ 2025 (రాత్రి 12:01 AM నుండి)
- దరఖాస్తుల చివరి తేదీ: 04 నవంబర్ 2025 (రాత్రి 11:59 PM వరకు)
- ఆధికారిక వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in
మొత్తం పోస్టులు – 391
- విభిన్న క్రీడా విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, ఉదాహరణకు –
- అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, సైక్లింగ్, స్విమ్మింగ్, షూటింగ్, ఫుట్‌బాల్, జూడో, హాకీ, కరాటే, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, రెజ్లింగ్, యోగా, వాటర్ స్పోర్ట్స్ మొదలైనవి.
- పురుషులు మరియు మహిళలు రెండువర్గాలకు కూడా పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
- పోస్ట్ పేరు: Constable (GD) under Sports Quota
- వేతన శ్రేణి (7th CPC): లెవల్ – 3 (₹21,700 – ₹69,100/-)
- ఇతర సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
విద్యార్హత
అభ్యర్థులు మాధ్యమికం (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షను ఉత్తీర్ణులై ఉండాలి.
క్రీడా అర్హతలు
- దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు క్రింద పేర్కొన్న కాలంల (04/11/2023 నుండి 04/11/2025 వరకు)
- క్రిందివాటిలో ఏదో ఒక అర్హత కలిగి ఉండాలి:
- భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించినవారు లేదా
- జాతీయ క్రీడా పోటీల్లో/చాంపియన్‌షిప్‌లలో బహుమతులు గెలిచినవారు లేదా
- ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించిన క్రీడా పోటీల్లో పాల్గొన్నవారు.
వయో పరిమితి (01 ఆగస్టు 2025 నాటికి)
- కనీస వయసు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయసు: 23 సంవత్సరాలు
వయో సడలింపు:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC (Non-Creamy Layer): 3 సంవత్సరాలు
- డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు: BSF నిబంధనల ప్రకారం అదనపు సడలింపు.
ఫిజికల్ స్టాండర్డ్స్
పురుష అభ్యర్థులు:
- ఎత్తు: 170 సెం.మీ.
- ఛాతి: 80 సెం.మీ. (5 సెం.మీ. విస్తరణ అవసరం)
మహిళా అభ్యర్థులు:
- ఎత్తు: 157 సెం.మీ.
- బరువు: ఎత్తు మరియు వయసుకు అనుగుణంగా ఉండాలి.(విభిన్న ప్రాంతాలు / తెగలకు సడలింపు వర్తిస్తుంది.)
వైద్య ప్రమాణాలు
- కళ్ల చూపు: 6/6 మరియు 6/9 (కళ్లద్దాలు లేదా లెన్స్ అనుమతి లేదు)
- రంగు అంధత్వం (color blindness) ఉండకూడదు.
- శారీరకంగా ఆరోగ్యవంతులు ఉండాలి.
- జనరల్ / OBC (పురుషులు): ₹159/-
- SC / ST / మహిళలు: ఫీజు మినహాయింపు
- చెల్లింపు విధానం: BSF వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే.
ఎంపిక విధానం
1. పత్రాల ధృవీకరణ (Document Verification)
2. Physical Standard Test (PST)m
3. Medical Examination (DME / RME)
4. Sports Performance ఆధారంగా మెరిట్ లిస్టు
దరఖాస్తు విధానం
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి https://rectt.bsf.gov.in
2. “Apply Online” పై క్లిక్ చేయండి.
3. అవసరమైన వివరాలు నమోదు చేయండి.
4. క్రీడా సర్టిఫికెట్‌లు, విద్యా పత్రాలు, ఫోటో అప్‌లోడ్ చేయండి.
5. రుసుము చెల్లించి దరఖాస్తును సమర్పించండి.
6. ప్రింట్ అవుట్ తీసుకొని భవిష్యత్తు అవసరాలకు ఉంచుకోండి.
ముఖ్య సూచనలు
- దరఖాస్తు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే స్వీకరించబడుతుంది.
- TA/DA చెల్లింపు లేదు.
- తప్పుడు సమాచారం లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే అర్హత రద్దు అవుతుంది.
- BSF నియామకం పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా ఉంటుంది.

0 comment