You might be interested in:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న శిశు గృహం, విశాఖపట్నం లో ఆయా (Aaya) పోస్టు భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి మంచి అవకాశం కల్పించబడింది.
విశాఖపట్నం జిల్లా శిశు గృహంలో ఆయా పోస్టు – అధికారిక నోటిఫికేషన్ 2026
పోస్టు వివరాలు:
- పోస్టు పేరు: ఆయా (Aaya)
- శాఖ: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ
- కార్యాలయం: శిశు గృహం, విశాఖపట్నం
- ఖాళీల సంఖ్య: 01
- జీతం: ₹7,944/- (నెలకు)
విద్యార్హత:
- కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి
- 25 నుంచి 42 సంవత్సరాలు
- కట్ ఆఫ్ తేదీ: 01-07-2025
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది
అనుభవం:
- కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి
- 10 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత
ముఖ్య తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 04-02-2026
- దరఖాస్తు చివరి తేదీ: 10-02-2026
- సమయం: సాయంత్రం 5:00 గంటల లోపు
దరఖాస్తు విధానం:
అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్ + బయోడేటా (CV) తో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాల నకళ్లను జతచేసి నేరుగా (Offline) కింది చిరునామాకు సమర్పించాలి.
చిరునామా:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం,
సంఘమిత్ర భవన్, గ్రౌండ్ ఫ్లోర్,
ఎం.వి.పి కాలనీ, విశాఖపట్నం – 530017
ముఖ్య గమనిక:
గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిశీలించబడవు
ఈ నోటిఫికేషన్‌ను ఎప్పుడైనా రద్దు చేసే హక్కు అధికారులకు ఉంటుంది

0 comment