AP Sakhi Niwas Recruitment 2026: ఏపీలో మహిళా హాస్టళ్లలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! పూర్తి వివరాలు ఇవే.. - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP Sakhi Niwas Recruitment 2026: ఏపీలో మహిళా హాస్టళ్లలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! పూర్తి వివరాలు ఇవే..

You might be interested in:

Sponsored Links

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని 'మిషన్ శక్తి' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా సఖి నివాస్ (Sakhi Niwas) వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హాస్టళ్లలో వివిధ రకాల పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.


ముఖ్య అంశాలు (Quick Highlights):

  • జీవో నంబర్: G.O.MS.No. 7, తేదీ: 24-03-2026.
  • మొత్తం హాస్టళ్లు: 30 కొత్త సఖి నివాస్ కేంద్రాలు. 
  • నియామక విధానం: అవుట్‌సోర్సింగ్ (Outsourcing) ప్రాతిపదికన. 
  • శాఖ: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (WD&CW).

ఖాళీల వివరాలు మరియు వేతనం (Post Details & Salary):

ప్రతి సఖి నివాస్ హాస్టల్‌లో 8 మంది సిబ్బందిని నియమించనున్నారు. పోస్టుల వారీగా నెలకు ఇచ్చే గౌరవ వేతనం వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

క్రమ సంఖ్య -  పోస్టు పేరు (Name of the Post) - పోస్టుల సంఖ్య - నెలవారీ జీతం (Rs.)

1/సఖి నివాస్ మేనేజర్ -  01 - రూ. 18,000/- 

2.వార్డెన్ (Warden) - 01 - రూ. 12,000/-  

3.కేర్ టేకర్ (Caretaker) - 03 - రూ. 10,000/- 

4. సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్- 03-  రూ. 8,000/- 

సఖి నివాస్ హాస్టళ్ల ప్రత్యేకత:

ఈ హాస్టళ్లను ఉద్యోగినుల సౌకర్యార్థం అద్దె భవనాల్లో ఏర్పాటు చేస్తారు. ప్రతి హాస్టల్‌లో 30 మంది మహిళలకు వసతి కల్పించడంతో పాటు, చిన్న పిల్లల కోసం క్రెచ్ (Creche - శిశు సంరక్షణ కేంద్రం) సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఏపీ మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ కేంద్రాల నిర్వహణ జరుగుతుంది.

దరఖాస్తు విధానం:

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం డైరెక్టర్, WD&CW ను ఆదేశించింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ లింక్ మరియు మరిన్ని వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి.

Download GO

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE