You might be interested in:
ఈ నెల 15న జరుగనున్న స్కూల్ కాంప్లెక్సుల తొలి సమావేశానికి విద్యాశాఖమంత్రి నారా లోకేష్ హాజరుకాను న్నారు. ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్య డైరెక్టర్ వీ విజయరామరాజు ఆర్జేడీ, డీఈవో, హెచ్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్సు నిర్వహణపై పలు కీలక ఆదేశాలు, మార్గదర్శకాలను జారీ చేశారు. ఇక మీదట పాఠశాల సముదాయాల సమావేశాల నిర్వహణ కేవలం ప్రతీ నెల మూడవ శనివారం మధ్యాహ్నం 1గంట నుంచి 5 గంటల వరకు మాత్రమే నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఒకవేళ 3వ శనివారం సెలవు అయితే 4వ శనివారం నిర్వహిం చాలన్నారు. పాఠశాల సముదాయాల సమావేశం రోజున అనగా 3 లేదా 4వ శనివారం నాడు అన్ని పాఠశాలల్లో ఖచ్చితంగా మధ్యాహ్నం 11.45కి మధ్యాహ్న భోజన కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున 3 లేదా 4వ శనివారం మధ్యాహ్నం విద్యార్థులకు సెలవు ప్రకటిం చాలన్నారు. ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అనివార్య కారణాలు అనగా అసాధారణ, అనారోగ్య కారణాల వలన తప్ప మరే ఇతర కారణాల దృష్ట్యా ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయవద్దని హెచ్ఎం, ఎంఈవోలకు సూచించారు. ఈ సమావేశాల రోజున పాఠశాల సముదా యాల పాఠశాల ఉపాధ్యాయులు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయడానికి ఐటి విభాగం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
శేఖర్ APTF
ఈ శనివారం పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి...
15వ తేదీ శనివారం మొదటి సమావేశం జరుగనున్న నేపథ్యంలో పాఠశాలల్లో పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. సమావేశానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్ కాంప్లెక్సులలో ఐఎఫె పి తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా ఐఎఫెపి లు పనిచేసి తీరాలని, అన్ని ఐఎఫెసి తరగతి గదుల్లోనూ ఇంటర్నెట్ సదుపాయం వుండాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాల సముదాయ పాఠశాలలోనూ ఇద్దరు చురుకైన, మంచి బోధనా సామర్థ్య వనరులు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (1 నుంచి 2 తరగతులు బోధించు వారు మరియు 3 నుంచి 5 తరగతలు బోధించు వారు) 8 మంది చురుకైన, మంచి బోధనా సామర్ధ్య వనరులు కలిగిన స్కూల్ అసిస్టెంట్లు (పిడితో సహా) ఎంపిక చేసుకుని సిద్ధంగా వుండాలన్నారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమాలను టైమ్ టు టైమ్ పట్టికను విడుదల చేశారు. టైమ్ టైబుల్ ప్రకారం కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటించాలని విజయరామరాజు ఆదేశించారు
0 comment