You might be interested in:
PGCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణవకాశంగా చెప్పవచ్చు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హర్యానాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) కింది 115 మేనేజర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం గురించి చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 115
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేనేజర్ (ఎలక్ట్రికల్), డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ఖాళీల వారీగా పోస్టులు
మేనేజర్ (ఎలక్ట్రికల్)- 09
డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 48
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 58
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 18
దరఖాస్తకు చివరి తేది: 2025 మార్చి 12
విద్యార్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు ఉంటుంది. మేనేజర్ పోస్టుకు 39 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 36 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 33 ఏళ్ల వయస్సు మించకూడదు.
పే స్కేల్: ఉ.ద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు మేనేజర్ పోస్టుకు రూ.1,13,500; డిప్యూటీ మేనేజర్‌కు రూ.97300; అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.76,700 వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
Download Complete Notification
అఫీషియల్ వెబ్ సైట్: https://www.powergrid.in
0 comment