You might be interested in:
డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజల పర్సనల్ ఇన్‌ఫర్మేషన్‌ని దొంగిలించడానికి స్కామర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పర్సనల్ ఇన్‌ఫర్మేషన్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇండియన్స్ అందరూ ఇంపార్టెంట్ డాక్యుమెంట్‌గా భావించే ఆధార్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ వివరాలను సేఫ్‌గా ఉంచడానికి బయోమెట్రిక్స్ లాక్ చేయవచ్చు. దీంతో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను ఎవరూ యాక్సెస్ చేయలేరు. అటే ఐడెంటిటీ థెఫ్ట్, ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండదు.
మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేస్తే.. మీ అనుమతి లేకుండా వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫేస్ డేటాను వెరిఫికేషన్ కోసం ఎవరూ ఉపయోగించలేరు. దీంతో బ్యాంకింగ్, సిమ్ కార్డ్ జారీ, ఆధార్‌తో లింక్ ఉన్న ప్రభుత్వ సేవల్లో మోసాలకు చెక్ పడుతుంది.
* ఆధార్ బయోమెట్రిక్ లాక్ అంటే?
ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్ అనేది UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అందించిన సెక్యూరిటీ ఫీచర్. ఇది మీ ఆధార్-లింక్డ్ ఫింగర్‌ఫ్రింట్, ఐరిస్, ఫేస్ డేటా దుర్వినియోగం కాకుండా రక్షిస్తుంది. ఒకసారి లాక్ చేశాక, మీ ఆధార్‌ని ముందుగా అన్‌లాక్ చేయకుండా ఎవరూ వెరిఫికేషన్ కోసం ఉపయోగించలేరు. ఆర్థిక లావాదేవీలు, సిమ్ కార్డ్ జారీలో మోసాలు జరిగే అవకాశం ఉండదు. UIDAI వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్ ద్వారా ఎప్పుడైనా మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్/అన్‌లాక్ చేయవచ్చు.
* ఎలా లాక్ చేయాలి?
ఇందుకు మూడు పద్ధతులు ఉన్నాయి.
- ఆన్‌లైన్
UIDAI myAadhaar పోర్టల్ విజిట్ చేసి, 'లాక్/అన్‌లాక్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. సూచనలను చదివి, 'నెక్స్ట్'పై క్లిక్ చేయండి. ఆధార్ వర్చువల్ ID (VID), పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్ వంటి అవసరమైన వివరాలు ఎంటర్ చేయండి. తర్వాత 'సెండ్ OTP'పై క్లిక్ చేసి, OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి. తర్వాత మీ బయోమెట్రిక్స్ లాక్ అవుతాయి.
- mAadhaar యాప్
Google Play Store లేదా Apple App Store నుంచి mAadhaar యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి. తర్వాత 'మై ఆధార్'పై నొక్కండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి. OTPని వెరిఫై చేయండి. 'బయోమెట్రిక్ లాక్' ఆప్షన్ ఎంచుకుని, బయోమెట్రిక్స్‌ని లాక్ చేయండి.
- SMS
మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి 1947 నంబర్‌కి 'GETOTP (స్పేస్) ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలు' ఫార్మాట్‌లో మెసేజ్ పంపండి. SMS ద్వారా OTPని అందుకుంటారు. తర్వాత.. 'లాక్యుయిడ్ (స్పేస్) ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలు (స్పేస్) 6-అంకెల OTP' ఫార్మాట్‌లో 1947కి మరొక మెసేజ్ పంపండి. మీ ఫోన్ నంబర్ మల్టిపుల్ నంబర్లకు లింక్ అయి ఉంటే, చివరి 4కి బదులుగా చివరి 8 అంకెలను ఉపయోగించండి. మీ బయోమెట్రిక్స్ లాక్ అవుతాయి.
* ఎర్రర్ కోడ్ 330
మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ అయితే, వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్లను ఉపయోగించి వెరిఫై చేయలేరు. మీరు ప్రయత్నిస్తే, డివైజ్ ఎర్రర్ కోడ్ 330ని చూపుతుంది. లాక్ అయిన కారణంగా మీ బయోమెట్రిక్స్ బ్లాక్ అయ్యాయని
0 comment