You might be interested in:
APPSC Group2: ఏపీపీఎస్స గ్రూప్-2 అభ్యర్థులు పోస్టుల ప్రాధాన్యతతో పాటు జోన్, జిల్లా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది. గ్రూప్-2లో భాగంగా 2023లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మార్చి నెల 10వ తేదీలోగా పోస్టుల ప్రాధాన్యత, జోనల్/జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.
మార్చి 4వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ వెబ్ ఆప్షన్స్ నమోదుకు కమిషన్ వెబ్‌సైట్‌లో విండో అందుబాటులోకి వస్తుంది. గత నెలాఖరులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-2 ప్రధాన పరీక్ష నిర్వ హించారు. తాజా ప్రకటనలో హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై ఏపీపీఎస్సీ కార్యదర్శి వివరణ ఇచ్చారు.
హారిజాంటల్ రిజర్వేషన్ కేటగిరిలో కేటాయించిన పోస్టులకు మహిళలు, దివ్యాంగులు, మాజీ సైని కులు, క్రీడాకారుల్లో అర్హులైన అభ్యర్ధులు లేకుంటే.. ఆ ఖాళీలను నిబంధనల ప్రకారం మాత్రమే భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు ఇటీవల ఆందోళనలు చేశారు.ఈ నేపథ్యంలో హారిజంటల్ రిజర్వేషన్ అమలుపై కమిషన్ స్పష్టత ఇచ్చింది.
హారిజాంటల్ రిజర్వేషన్ కింద అర్హులైన మహిళా అభ్యర్థులు లేకుంటే.. ఆ పోస్టులను ప్రతిభ కలిగిన మహిళా అభ్యర్థులతో భర్తీ చేస్తామని ఒకవేళ వారు కూడా లేకుంటే అర్హత కలిగిన పురుష అభ్యర్థులతో భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేసేందుకు ఎస్సీ/ ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/జనరల్ వివరాలతో ఆప్షన్స్ ఇచ్చేందుకు వెబ్‌సైట్‌లో అవకా శాన్ని కల్పించారు. జనరల్ కేటగిరి పోస్టుల ఖాళీల భర్తీకి మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులందరూ ఆప్షన్స్ నమోదు చేయొచ్చు.
రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో, మహిళలు, బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PBDలు), మాజీ సైనికులు మరియు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు.
హారిజంటల్ రిజర్వేషన్ కేటగిరీలలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, పేర్కొన్న నిబంధనల ప్రకారం ఆ ఖాళీలు భర్తీ చేస్తారు.
SC/ST/BC/EWS/జనరల్ కోటా కింద మహిళలు, బెంచ్‌మార్క్ వికలాంగులు , మాజీ సైనికులు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం రిజర్వు చేయబడిన ఖాళీల కోసం పురుష అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాధాన్యత క్రమంలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు.
అభ్యర్థులు తమ పోస్ట్ మరియు జోనల్/జిల్లా ప్రాధాన్యతలు ఏవైనా ఉంటే, కమిషన్ వెబ్‌సైట్ అంటే https://psc.ap.gov.in ద్వారా 4వ తేదీ నుండి 10 మార్చి 2025 వరకు సమర్పించాల్సి ఉంటుంది.
0 comment