You might be interested in:
AP High Court Job Notification: ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ(లా) లో పాసైన అభ్యర్థులకు ఇది మంచి సువర్ణ అవకాశం అనే చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది.
హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. హైకోర్టులో మొత్తం 50 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 17న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ఉద్యోగ ఖాళీల సంఖ్య: 50
హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 20
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 17
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా)లో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాకలు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.)
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 ఫిబ్రవరి 1 నాటికి 35 ఏళ్ల వయస్సు మించరాదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.కంప్యూటర్ బేస్ డే టెస్ట్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. 100 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 2 గంటల సమయం ఉంటుంది.
జీతం: ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు ఉంటుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్: గుంటూరు, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://aphc.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
0 comment