You might be interested in:
APSSDC Job opportunity: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు, యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (APSSDC) గుడ్ న్యూస్ చెప్పింది.
మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఎనర్జీ సిస్టమ్స్ విభాగాల్లో శిక్షణ కల్పించి జర్మనీలోని పలు కంపెనీల్లో ఉద్యోగం ఇవ్వనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ అవకాశం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఎనర్జీ సిస్టమ్స్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాసై అభ్యర్థులకు సువర్ణవకాశం. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోవచ్చు. మార్చి 25 న దరఖాస్తు గడువు ముగియనుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలను చూద్దాం.
నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మంచి నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఎస్డీసీ, 2కామ్ సంస్థతో కలిసి ఈ శిక్షణ ఇవ్వనుంది. యువతకు జర్మనీ భాష నేర్పించి ఉద్యోగం అవకాశం కల్పించనున్నారు. విశాఖపట్నం, విజయవాడల్లో ఈ నైపుణ్య శిక్షణ నిర్వహించనున్నారు.
అర్హత: మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఎనర్జీ సిస్టమ్స్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారికి జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వబోతోంది.
వయస్సు: 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ లేదా డిప్లొమా హోల్డర్లు మరియు సంబంధిత రంగాలలో మూడేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్న పురుషులు, మహిళలు దరఖాస్తు పెట్టుకోవచ్చు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వర్చువల్ మోడ్ ద్వారా ఇంగ్లీష్ స్కిల్స్ టెస్ట్ చూసి సెలెక్ట్ చేస్తారు.
ఇందులో ఎంపికైన అభ్యర్థులు జర్మనీ భాషలో ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్థులు స్థాయిని బట్టి శిక్షణ ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఇవ్వనున్నారు. అభ్యర్థులు ఎంపిక చేసిన జర్మన్ కంపెనీలు వీసా, ఫ్లైట్ ఛార్జీలు, బీమా ప్రీమియంన భరిస్తాయి. అలాగే అభ్యర్థులకు రూ.40,000 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ తో పాటు రూ.30,000 డాక్యుమెంటేషన్ ఛార్జీలను కూడా భరిస్తుంది.
శిక్షణ కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ
కావాల్సిన సర్టిఫికెట్స్:
అభ్యర్థులు పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్, SSC సర్టిఫికేట్ లేదా మార్క్‌షీట్, డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ (లైట్ వెహికల్ లేదా హెవీ వెహికల్) తీసుకురావాలి.
ఒప్పందం: ఉద్యోగ ఒప్పందం వ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుంది.
జీతం: 2800 నుండి 3600 యూరోలు ఉంటుంది
జర్మన్ భాషలో శిక్షణ వీసా ప్రాసెసింగ్‌తో సహా ప్రాసెసింగ్ సమయం ఆరు నెలలు ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు APSSDC పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు
పోర్టల్:https://naipunyam.ap.gov.in/
అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. భారీ వేతనం కూడా కల్పించనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైనవి:
దరఖాస్తుకు లాస్ట్ డేట్: మార్చి 25
జీతం: 2800 నుంచి 3600 యూరోలు (భారతదేశ కరెన్సీలో రూ.2,60,400 నుంచి రూ.3,34,800 ఉంటుంది)
0 comment