You might be interested in:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు నిర్ణయాల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బడికి వెళ్లే ప్రతీ విద్యార్థి తల్లి ఖాతాల్లో రూ 15 వేలు తల్లికి వందనం పేరుతో జమ చేసేందుకు నిధులు కేటాయించింది. ఇప్పుడు, మహిళలకు మరో శుభవార్త చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది.AP
డ్వాక్రా మహిళల కోసం
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మహిళా దినోత్సవం వేళ అమలు చేసే విధంగా ఒక నిర్ణయాన్ని ఖరారు చేసారు. రాష్ట్రంలోని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1,02,832 మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 255 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్లూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా అదే సామాజిక వర్గానికి చెందిన 11,016 మందిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం దాదాపు చివరి దశకు చేరుకుంది.
రూ లక్ష రుణం
ఇదే సమయంలో మరో నిర్ణయం పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళ లకు కొత్త రుణాల పైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ప్రకటన చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. డ్వాక్రా మహిళలకు రూ లక్ష వరకు నామ మాత్రపు వడ్డీతో అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ నెల 8న ప్రభుత్వం ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఒక్కో క్కరికి రూ లక్ష వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. ఈ మొత్తాన్ని మహిళలు ప్రత్యేక సందర్భాల్లో వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు.
తుది నిర్ణయం
డ్వాక్రా మహిళలకు తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లతో పాటు ఇళ్ల నిర్మాణం వంటి ఖర్చులకు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఈ రుణాలను 5 శాతం వడ్డీకి అందించేలా ఆలోచన చేస్తున్నారు. బ్యాంకర్లతో చర్చల తరువాత ఈ పథకం విధి విధానాల ను అధికారికంగా ప్రకటించేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఆర్దిక - మహిళా సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి నివేదికలు అందించినట్లుగా ప్రభుత్వ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి తుది నిర్ణయం తరువాత ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
0 comment