You might be interested in:
Gold ETF: మీరు రిస్క్ లేకుండా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్.
ఎందుకంటే బంగారం ధర బాగా పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల స్టాక్ మార్కెట్ కంటే బంగారమే ఇన్వెస్టర్లకు బాగా నచ్చుతోంది. ఇది రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ అని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. గోల్డ్ ETFలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) అంటే ఏంటి?
గోల్డ్ ఈటీఎఫ్ (Gold Exchange-Traded Fund) అనేది స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అయ్యే ఒక ప్రత్యేకమైన మ్యూచువల్ ఫండ్. ఇది ఫిజికల్ గోల్డ్‌ను ప్రత్యామ్నాయ పెట్టుబడి రూపంగా అందిస్తుంది. దీన్ని ఈజీగా కొనొచ్చు, అమ్మొచ్చు. గోల్డ్ ETFని స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైనా కొని, ఎప్పుడైనా అమ్మేసి లాభం పొందొచ్చు.
రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్ ఎందుకంటే..
ఫిజికల్ గోల్డ్‌ను బ్యాంకులో లేదా లాకర్‌లో పెడితే ఫీజు కట్టాలి. ఇంట్లో పెడితే దొంగల భయం. కానీ గోల్డ్ ETFకి అలాంటి ఇబ్బందేం లేదు. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ యూనిట్స్‌కు స్టోరేజ్ కాస్ట్ ఏమీ ఉండదు. ఇది డీమాట్ అకౌంట్‌తో లింక్ అయి ఉంటుంది. దీనివల్ల వచ్చే లాభాన్ని ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్‌కు మార్చుకోవచ్చు.
మేకింగ్ ఛార్జెస్ అవసరం లేదు
మీరు ETF రూపంలో డిజిటల్ బంగారం కొన్నప్పుడు, బంగారు నగల మేకింగ్ ఛార్జ్ గురించి టెన్షన్ పడక్కర్లేదు. జనరల్‌గా బంగారు నగల మేకింగ్ కాస్ట్ 15-20% వరకు ఉండొచ్చు. గోల్డ్ ETFలో ఇది ఉండదు. అందువల్ల డబ్బులు కలిసి వస్తాయి. ఆ డబ్బులను మళ్లీ గోల్డ్ ETFలోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.
తక్కువ డబ్బులతోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు
మీ దగ్గర తక్కువ డబ్బులున్నా గోల్డ్ ETF కొనొచ్చు. చిన్న చిన్న యూనిట్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు 1 గ్రామ్ ఫిజికల్ బంగారం కొనాలంటే దాదాపు 8,500 రూపాయలు ఇవ్వాలి. కానీ గోల్డ్ ETF 500-1,000 రూపాయలు లేదా 100-200 రూపాయల్లో కూడా కొనొచ్చు. ధర పెరిగినప్పుడు వెంటనే అమ్మేసుకోవచ్చు.
బంగారం ధర చెక్ చేసుకుంటూ ఉంటే చాలు
బంగారం ధరను కనిపెట్టడం చాలా ఈజీ. మీరు గోల్డ్ ETFలో ఇన్వెస్ట్ చేస్తే, ప్రతిరోజు దీని పర్ఫార్మెన్స్ చూడొచ్చు. అది ఎంత పైకి లేదా కిందకు వస్తుందో చూడొచ్చు. దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుందో మీకు తెలుస్తుంది. ఇది ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చాలా క్లియర్‌గా ఉంటుంది. మీ అవసరాలు, తగిన సమయంలో అమ్ముకుంటే మంచి లాభాలు పొందొచ్చు.
0 comment