విద్యార్థులూ ఇస్రో స్పేస్​ సెంటర్లు చూడాలని ఉందా? - అయితే 'యువికా'కు వెంటనే అప్లై చేసుకోండి - ISRO YUVIKA 2025 - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

విద్యార్థులూ ఇస్రో స్పేస్​ సెంటర్లు చూడాలని ఉందా? - అయితే 'యువికా'కు వెంటనే అప్లై చేసుకోండి - ISRO YUVIKA 2025

You might be interested in:

Sponsored Links

 ISRO YUVIKA 2025 Young Scientist Programme :అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది.అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్ర దేశాలకు దీటుగా భారత్‌ పలు కీలక పరిశోధనలు చేపడుతోంది. ఈ పరిశోధనలకు సంబంధించిన విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు వారిలో స్ఫూర్తిని నింపే సదుద్దేశంతో ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.యువికా నిర్వహించే ప్రాంతాలు ఇవే :ఇస్రో యువికా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ కింది ప్రాంతాల్లో నిర్వహిస్తోంది.

హైదరాబాద్‌ (తెలంగాణ)సూళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్‌)డెహ్రడూన్‌ (ఉత్తరాఖండ్‌)తిరువనంతపురం (కేరళ)బెంగళూరు (కర్ణాటక)అహ్మదాబాద్‌ (గుజరాత్‌)షిల్లాంగ్‌ (మేఘాలయ)

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి? :విద్యార్థులు మార్చి 23వ తేదీలోగా ఇస్రో అధికారిక వెబ్​సైట్​ను www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్‌ 7న ఎంపికైన విద్యార్థుల జాబితాను అధికారులు విడుదల చేస్తారు. మే 18వ తేదీ నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా-25 కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మే 31న బహుమతులు అందజేస్తారు.

ఎంపిక విధానం :ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా యువికాకు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీని ఇస్తారు. స్పేస్, సైన్స్‌ క్లబ్‌లలో ఉంటే 5 శాతం వెయిటేజీ, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎస్సే రైటింగ్​లో, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్‌సీసీ, స్కౌట్ అండ్‌ గైడ్‌ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు.ఉచిత వసతి, భోజన సౌకర్యాలు :ఈ యువికా కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. వారిని మే నెలలో 14 రోజుల పాటు ఇస్రోకు సంబంధించిన స్పేస్‌ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన వింతలు, విశేషాలతో పాటు సప్తగ్రహ కూటమి అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. సైంటిస్ట్​లతో మాట్లాడే అవకాశం లభిస్తుంది.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE