You might be interested in:
పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆ సంస్థ యాజ మాన్యం ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకు 6.49 లక్షల మంది విద్యార్థులు 3,450 పరీక్ష కేంద్రాలకు హాజరవుతారు. వీరంతా ఇళ్ల నుంచి పరీక్ష కేంద్రానికి, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి చేరుకునేందుకు ఆర్టీసీ
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. కేవలం హాల్ టికెట్ చూపిస్తే చాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి, వివిధ మార్గాల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు పేలా ఏర్పాట్లు. నడిపేలా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ప్రజారవా ణాశాఖ అధికారులను యాజమాన్యం ఆదేశించింది
0 comment