Women's day : మహిళల పేరిట హోమ్‌ లోన్‌ తీసుకుంటే లాభాలే.. లాభాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Women's day : మహిళల పేరిట హోమ్‌ లోన్‌ తీసుకుంటే లాభాలే.. లాభాలు

You might be interested in:

Sponsored Links

 గృహ రుణాలపై (Home Loan) ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్ తగ్గించడంతో (Reduction in the Repo Rate) బ్యాంక్ లలో హోమ్ లోన్ దరఖాస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.



ఈ సందర్భంలో మహిళల పేరిట హోమ్ లోన్ (Benefit Of Women Home Loan) తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వడ్డీ రేటులో తగ్గింపు, స్టాంప్ డ్యూటీలో రాయితీ, ఆదాయపన్ను మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక బ్యాంకులు కూడా అందిస్తున్నాయి. మహిళలు తమ పేరు మీద హోమ్ లోన్ తీసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో సొంత ఇంటిని కలను నిజం చేసుకోవచ్చు.

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

హోమ్ లోన్ తీసుకునే మహిళలకు బ్యాంకులు సాధారణ రుణగ్రహీతల కంటే తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. సగటున, మహిళా రుణగ్రహీతలకు 0.05% నుండి 0.10% వరకు తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. దీర్ఘకాలంలో ఇది లక్షల రూపాయల వరకు ఆదాయం అందించవచ్చు. ఉదాహరణకు రూ. 50 లక్షల హోమ్ లోన్ పై ఒక సాధారణ రుణగ్రహీతకు 8.70% వడ్డీ రేటు ఉంటే, అదే మహిళ పేరిట అప్లై చేస్తే 8.60% గా తగ్గుతుంది. దీని ద్వారా నెలవారీ EMI తగ్గడంతో పాటు మొత్తం చెల్లించాల్సిన మొత్తం కూడా తగ్గిపోతుంది.


మహిళలు హోమ్ లోన్ తీసుకుంటే ఆదాయపన్ను మినహాయింపులు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద హోమ్ లోన్ అసలుపై సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అలాగే సెక్షన్ 24(b) కింద వడ్డీపై సంవత్సరానికి రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ముఖ్యంగా మహిళలు కో-అప్లికెంట్ గా ఉంటే ఈ ప్రయోజనాలు రెట్టింపవుతాయి. కాబట్టి హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే పురుషులు సహ-అప్లికెంట్ గా మహిళను చేర్చుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

మహిళల ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీపై రాయితీలను అందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో మహిళల పేరిట కొనుగోలు చేసే ఆస్తులకు 1-2% స్టాంప్ డ్యూటీ తగ్గింపును అందిస్తున్నారు. అంతేకాదు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలు ఈ పథకం ద్వారా 6.5% వడ్డీ రాయితీతో పాటు క్రెడిట్ సబ్సిడీ కూడా పొందవచ్చు. ఓవరాల్ గా మహిళల పేరిట హోమ్ లోన్ తీసుకోవడం అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE