You might be interested in:
మెగా DSC-2025 నియామక ప్రక్రియకు సంబంధించిన విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ / నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వొచ్చింది . ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక, అనవసరమైన భయం కలిగించడం మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో, ఉదేశ్య పూర్వకంగా, ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉదేశ్యంతో చేస్తున్నట్లుగా తెలియుచున్నది.
ఈ విషయంగా తెలియచేయడం ఏమనగా! అన్ని అధికారిక స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్లు మెగా DSC అధికారిక వెబ్సైటు మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వంచే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి. సోషల్ మీడియా మరియు అనధికార వెబ్సైట్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారమూ చెల్లుబాటు కాదు.
ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్ట పరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక, ఆ వ్యక్తి / వ్యక్తులు నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు.
అభ్యర్థులు మరియు ప్రజలు ఇలాంటి వదంతులను/ దుష్ప్రచారాలను నమ్మకుండా, కేవలం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియచేయడం జరుగుతోంది.
0 comment