You might be interested in:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 3,038 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలు
ఉద్యోగాల వివరాలు:
* డ్రైవర్ పోస్టులు: 2,000
* శ్రామిక్: 743
* డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్): 84
* డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్): 114
* డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 25
* అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్: 18
* అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 23
* సెక్షన్ ఆఫీసర్ (సివిల్): 11
* అకౌంట్స్ ఆఫీసర్: 6
* మెడికల్ ఆఫీసర్: 14
ఈ నియామక ప్రక్రియ ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మి మోసపోవద్దని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
మరిన్ని వివరాలు త్వరలో విడుదలయ్యే అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడికానున్నాయి.
0 comment