You might be interested in:
తేది:15.03.2025 నుండి పాఠశాలలకు ఒంటిపూట బడులు....
అకడెమిక్ క్యాలెండర్, 2024-25 ప్రకారం, జిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్యములలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా, పాఠశాలలలకు ఒంటిపూట బడులు తేది:15.03.2025 నుండి 23.04.2025 వరకు 07.45 AM నుండి 12.30 PM వరకు నిర్వహించాలని ఆదేశించడమైనది.
అలాగే 10 వ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలు గల పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 01.00 PM నుండి 05.00 PM వరకు పాఠశాలలు పని చేయవలెను.
ఎండ తీవ్రత దృష్ట్యా గ్రామ పంచాయితీ మరియు RWS సహకారం తో త్రాగునీటి వసతి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ వారి సహకారం తో ORS ప్యాకెట్లు పాఠశాలలలో అందుబాటులో ఉంచుకోవాలి. పాఠశాల సమయం ముగిసిన తరువాత MDM విద్యార్థులకు వడ్డించాలి.
కావున జిల్లా లోని ఉపవిద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాధికారులు తమపరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండ ప్రధానోపాధ్యాయులు తగిన ఏర్పాట్లను చేసుకొనేటట్లు నిర్ధారించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ.యస్. శామ్యూల్ పాల్ గారు ఒక ప్రకటనలో తెలియజేసారు.
0 comment